‘రైతుబంధుగా రూ.7,279 కోట్లు ఇచ్చాం.. వడ్డీ రాయితీ సమస్యే కాదు’

తెలంగాణలో రైతుల పంట రుణాలకు సంబంధించిన వడ్డీ రాయితీ నిధుల విడుదలపై రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సమాచారమిచ్చారు. శాసనమండలిలో కాంగ్రెస్ సభ్యుడు జీవన్ రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి పూర్తి స్పష్టత..

'రైతుబంధుగా రూ.7,279 కోట్లు ఇచ్చాం.. వడ్డీ రాయితీ సమస్యే కాదు'
Follow us

|

Updated on: Sep 15, 2020 | 4:29 PM

తెలంగాణలో రైతుల పంట రుణాలకు సంబంధించిన వడ్డీ రాయితీ నిధుల విడుదలపై రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సమాచారమిచ్చారు. శాసనమండలిలో కాంగ్రెస్ సభ్యుడు జీవన్ రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి పూర్తి స్పష్టత నిచ్చే ప్రయత్నం చేశారు. ఆర్థికశాఖ వద్ద వడ్డీరాయితీ బకాయిల లెక్క ఉందన్న మంత్రి.. పాస్ బుక్ తో సంబంధం లేకుండా రుణాల మంజూరుకు ఉత్తర్వులు ఇస్తామన్నారు. రైతాంగానికి రావాల్సిన ప్రతి రూపాయి చెల్లిస్తామని.. నాలుగు విడతలలో రైతు రుణమాఫీ చేయాలని నిర్ణయించామని స్పష్టం చేశారు. 25 వేల లోపు రుణాలన్నీ పూర్తిగా మొదటి విడతలో తీర్చేశామన్న మంత్రి.. రెండో విడత రుణమాఫీకి కసరత్తు జరుగుతుందని తెలిపారు. ఈ వానాకాలంలో రూ.7279 కోట్లు రైతుబంధు కింద రైతులకు ఇచ్చామని.. రాబోయే యాసంగిలో మరో రూ.7500 కోట్లు అందించాల్సి ఉంటుందని తెలిపారు. రైతులకోసం ఇంత భరిస్తున్న ప్రభుత్వానికి వందల కోట్ల పంట రుణాల వడ్డీ రాయితీ పెద్ద సమస్య కాదని తేల్చిచెప్పారు. పంటరుణాల విషయంలో లక్ష వరకు రుణాలలో 3 శాతం రిజర్వ్ బ్యాంక్, 4 శాతం రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తాయని మంత్రి పేర్కొన్నారు