ట్రంప్ కుమారుడు బారన్‌కు కరోనా..!

|

Oct 15, 2020 | 8:01 AM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ దంపతుల కుమారుడు బారన్(14) కరోనా బారిన పడ్డారు.

ట్రంప్ కుమారుడు బారన్‌కు కరోనా..!
Follow us on

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ దంపతుల కుమారుడు బారన్(14) కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని మెలానియా ట్రంప్ బుధవారం వెల్లడించారు. అయితే, తాజాగా చేసిన పరీక్షలో బారన్‌కు కరోనా నెగిటివ్ వచ్చిందని ఆమె స్పష్టం చేశారు. కాగా, బారన్‌కు ప్రస్తుతం ఎటువంటి లక్షణాలు లేవని మెలానియా తెలిపారు. ఇదిలావుంటే అక్టోబర్ 2న డొనాల్డ్ ట్రంప్ తోపాటు ఆయన సతీమణి మెలానియా ట్రంప్ కరోనా బారిన పడి కోలుకున్నారు. ట్రంప్ మూడు రోజుల పాటు సైనిక ఆస్పత్రిలో చికిత్స పొందారు.

కరోనా నుంచి కోలుకోవడంతో ట్రంప్ ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో హుషారుగా పాల్గొంటున్నారు. ఇక మెలానియా ట్రంప్ క్వారంటైన్‌లోనే కొనసాగుతున్నారు. ప్రస్తుతం తనకు లక్షణాలు స్వల్పంగానే ఉన్నాయని, అతిత్వరలోనే ప్రథమ మహిళ బాధ్యతలను తిరిగి మొదలుపెడతానని ఆమె వెల్లడించారు. కరోనా సోకిన తరువాత ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్నానని ఆమె తెలిపారు. త్వరలో పూర్తిస్థాయిలో కోలుకుని ప్రజా సేవలో పాల్గొంటానన్నారు.