Namaste Trump: భారత సినిమాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసలు కురిపించారు. భారత సినిమాలను ప్రపంచ దేశాలు ఇష్టపడుతున్నాయని ఆయన అన్నారు. దీనికి షారూక్ నటించిన ‘దిల్‌వాలే దుల్హానియో లే జాయేంగే’ సినిమాను ప్రస్తావించారు. ఆ మూవీని ప్రపంచం మొత్తం ఇష్టపడిందని ట్రంప్ పేర్కొన్నారు. ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమంలో భాగంగా భారతీయులను ఉద్దేశించి మాట్లాడిన ట్రంప్.. ఇండియాలోని అన్ని భాషల్లో సంవత్సరానికి దాదాపుగా 2వేల సినిమాలకు పైగా వస్తున్నాయని వెల్లడించారు. ఈ సినిమాలు మిగిలిన దేశాలతో భారత్ అనుబంధాలు పెరగడానికి కూడా కారణమవుతున్నాయని అన్నారు. సంస్కృతి, సంప్రదాయాలకు భారత్ పెద్దపీట వేస్తుందని ట్రంప్ ప్రశంసలు కురిపించారు.
కాగా ఇటీవల ఆయుష్మాన్ ఖురానా నటించిన ‘శుభ్ మంగళ్ జ్యాదా సావదాన్’ సినిమాపై కూడా ట్రంప్ ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని ప్రశంసిస్తూ LGBTQ+ యాక్టివిస్ట్ పీటర్ టాట్చెల్ వేసిన ట్వీట్‌పై స్పందించిన ట్రంప్.. ‘గ్రేట్’ అంటూ కామెంట్ చేశారు.