AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీనేజర్ల న్యూడ్​ సెల్ఫీల ఆటకట్టు..పేరెంట్స్‌కు సమాచారం

మీరు సోషల్ మీడియాని యూజ్ చేస్తుంటే “న్యూడ్ పిక్స్ పంపు” అనే పదం గురించి తెలిసే ఉండొచ్చు. టీనేజ్ యూత్ వారి భాగస్వాములకు పంపిన నగ్న సెల్ఫీలు పెరగడం వల్ల ఈ పదం ప్రాచుర్యం పొందింది. అవగాహన లేని ఇటువంటి పనులు వల్ల యువత చిక్కుల్లో పడుతోంది.

టీనేజర్ల న్యూడ్​ సెల్ఫీల ఆటకట్టు..పేరెంట్స్‌కు సమాచారం
Ram Naramaneni
|

Updated on: Feb 24, 2020 | 3:24 PM

Share

మీరు సోషల్ మీడియాని యూజ్ చేస్తుంటే “న్యూడ్ పిక్స్ పంపు” అనే పదం గురించి తెలిసే ఉండొచ్చు. టీనేజ్ యూత్ వారి భాగస్వాములకు పంపిన నగ్న సెల్ఫీలు పెరగడం వల్ల ఈ పదం ప్రాచుర్యం పొందింది. అవగాహన లేని ఇటువంటి పనులు వల్ల యువత చిక్కుల్లో పడుతోంది. ఆ ఫోన్ పోయినప్పుడు లేదా తస్కరణకు గురైనప్పుడు అందులోని ఫోటోలు ఇంటర్నెట్‌‌లో సర్కులేట్ అవ్వడం పరిపాటిగా మారింది. హత్యలు, ఆత్మహత్యలు వంటి వాటికి ఈ న్యూడ్ ఫోటోలు దారితీస్తున్నాయి. వీటికి చెక్ పెట్టేందుకు అదిరిపోయే ఆప్షన్‌తో స్మార్ట్‌ఫోన్‌ను ప్రవేశపెట్టింది జపనీస్ కంపెనీ. ‘టోన్ ఇ 20’ అనేది ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ టీనేజర్లను న్యూడ్ సెల్ఫీ తీసుకోకుండా నిరోధిస్తుంది.

స్మార్ట్​ఫోన్​ ప్రొటెక్షన్​ అనే స్పెషల్ ఫీచర్​తో వస్తోన్న ఈ ఫోన్​ అసభ్యకరమైన ఫొటోలు ఉంటే గుర్తిస్తుంది. ఈ ఫోన్ వినియోగించే టినేజర్లు తమవి లేదా ఇతరుల న్యూడ్  ఫొటోలను తీయకుండా నియంత్రిస్తుంది. ఈ ఫోన్‌లో ‘టోన్​ కెమెరా’ డిఫాల్ట్​గా వస్తుంది. అసభ్యకరమైన ఫోటోలు తీస్తుండగానే వాటిని నిరోధించి.. ఫోన్​లో సేవ్​ కాకుండా డిలీట్​ చేస్తుంది. AIతో మెషీన్ లెర్నింగ్‌ వల్ల ఇది సాధ్యమవుతుంది. అంతేకాదు.. ఈ ఫోన్ యూజ్ చేస్తోన్న టీనేజర్ల పేరెంట్స్ ఫోన్​కు అనుసంధానమై ఉంటుంది. న్యూడ్​ ఫొటోలు క్లిక్ చేసిన వెంటనే వారి తల్లిదండ్రులకు సమాచారం చేరవేస్తోంది. టీనేజర్ల యొక్క భద్రతను కాపాడానికి టోన్ సంస్థ ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తెస్తోంది. 6.2 అంగుళాల హెచ్​డీ ప్లస్​ డిస్​ప్లే కలిగి ఉండే ఈ ఫోన్‌కి 4జీబీ ర్యామ్​-64జీబీ రామ్​ స్పేస్ ఉంటుంది.  మూడు వెనుక కెమెరాలు (12ఎంపీ+13ఎంపీ+2ఎంపీ) ఉంటాయి.  3,900 ఎంఏహెచ్​ బ్యాటరీ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఫోన్ వెల  19,800 యెన్​లు (రూ.12,750).

పనికిరావని పారేస్తున్నారా? ఈ గింజలే ఆరోగ్యానికి శ్రీరామరక్ష!
పనికిరావని పారేస్తున్నారా? ఈ గింజలే ఆరోగ్యానికి శ్రీరామరక్ష!
భూగర్భంలో అతిపెద్ద బంగారు నిధి.. 3400 టన్నుల గోల్డ్‌ గుర్తింపు!
భూగర్భంలో అతిపెద్ద బంగారు నిధి.. 3400 టన్నుల గోల్డ్‌ గుర్తింపు!
అప్పుడెప్పుడో మాయం అయ్యింది.. ఇప్పుడు మెగాస్టార్ మూవీతో ఛాన్స్..
అప్పుడెప్పుడో మాయం అయ్యింది.. ఇప్పుడు మెగాస్టార్ మూవీతో ఛాన్స్..
నారింజ పండ్ల తొక్కలు పడేస్తున్నారా? మీరీ విషయం తెలుసుకోవాల్సిందే
నారింజ పండ్ల తొక్కలు పడేస్తున్నారా? మీరీ విషయం తెలుసుకోవాల్సిందే
దుర్వాసనను స్పాంజ్‌లా పీల్చేస్తుంది.. యాపిల్ చేసే మ్యాజిక్ ఇదే
దుర్వాసనను స్పాంజ్‌లా పీల్చేస్తుంది.. యాపిల్ చేసే మ్యాజిక్ ఇదే
గంగవ్వ శతాయుష్కురాలు.. 101 పడిలోకి అడుగు
గంగవ్వ శతాయుష్కురాలు.. 101 పడిలోకి అడుగు
ఇంట్లో ఎలుకలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయా? ఇలా తరిమికొట్టండి!
ఇంట్లో ఎలుకలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయా? ఇలా తరిమికొట్టండి!
న్యాయం, ధర్మం, ఖాకీ బుక్ అందరికీ ఒకేలా ఉండాలిః కేటీఆర్
న్యాయం, ధర్మం, ఖాకీ బుక్ అందరికీ ఒకేలా ఉండాలిః కేటీఆర్
క్యాబేజీ వీరికి యమ డేంజర్‌.. తిన్నారో నేరుగా కైలాసానికే!
క్యాబేజీ వీరికి యమ డేంజర్‌.. తిన్నారో నేరుగా కైలాసానికే!
జెట్ స్పీడ్‌లో గోపీచంద్ నయ మూవీ షూటింగ్..
జెట్ స్పీడ్‌లో గోపీచంద్ నయ మూవీ షూటింగ్..