Trump Menu: భారత పర్యటనలో ఉన్న ట్రంప్ దంపతులకు గుజరాతీ రుచులతో కూడిన డిషెస్, వంటకాలు సిధ్ధంగా ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా ఖమాన్ (స్పెషల్ స్వీట్), రోటీలు, సమోసాలు ఉన్నట్టు షెఫ్ సురేష్ ఖన్నా తెలిపారు. ఈ కపుల్ విజిట్ సందర్భంగా వీటిని ప్రత్యేకంగా తయారు చేశామని, సెక్యూరిటీ సిబ్బంది వీటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారని ఆయన చెప్పారు. ఇంకా తేనెలో తడిపిన కుకీలు, కొబ్బరినీళ్లు, ఐస్ టీ, స్పెషల్ చాయ్, స్నాక్స్ ఉన్నాయని సురేష్ ఖన్నా వివరించారు. మెనూలో మరికొన్ని పదార్థాలు కూడా ఉన్నాయని, మెనూ పూర్తిగా అమెరికన్ దంపతులకు సంతృప్తి కలిగిస్తుందని ఆశిస్తున్నామని ఆయన చెప్పారు. వారి కోసం ఈ డిష్ లను తయారు చేయడం తమ అదృష్టమే అన్నారాయన..