నువ్వు ఎప్పటికి గుర్తుండిపోతావు ఛాంపియన్

| Edited By:

Jul 04, 2019 | 7:14 AM

వరల్డ్ కప్‌కు ఎంపికైన భారత జట్టులో స్థానం దక్కకపోవడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న అంబటి రాయుడు అన్ని ఫార్మాట్లలో క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. ఈ మేరకు తన రాజీనామా లేఖను బుధవారం బీసీసీఐకు పంపాడు. అయితే ఆయన తీసుకున్న ఈ నిర్ణయంపై పలువురు ప్రముఖులు స్పందిస్తున్నారు. రాయుడు తొందరపడి నిర్ణయం తీసుకున్నాడని కొందరు.. సెలక్టర్లు అతడి టాలెంట్‌ను గుర్తించలేదని మరికొందరు తమ తమ అభిప్రాయాలను తెలిపారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. […]

నువ్వు ఎప్పటికి గుర్తుండిపోతావు ఛాంపియన్
Follow us on

వరల్డ్ కప్‌కు ఎంపికైన భారత జట్టులో స్థానం దక్కకపోవడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న అంబటి రాయుడు అన్ని ఫార్మాట్లలో క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. ఈ మేరకు తన రాజీనామా లేఖను బుధవారం బీసీసీఐకు పంపాడు. అయితే ఆయన తీసుకున్న ఈ నిర్ణయంపై పలువురు ప్రముఖులు స్పందిస్తున్నారు. రాయుడు తొందరపడి నిర్ణయం తీసుకున్నాడని కొందరు.. సెలక్టర్లు అతడి టాలెంట్‌ను గుర్తించలేదని మరికొందరు తమ తమ అభిప్రాయాలను తెలిపారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. అంబటి రాయుడు రిటైర్మెంట్‌పై స్పందించారు.

‘‘నీ సూపర్‌ టాలెంట్ ఎప్పటికీ గుర్తిండిపోతుంది ఛాంపియన్. నిన్ను సెలక్టర్లు గుర్తించకపోవచ్చు. కానీ భారత క్రికెట్ అభిమానులు నీ టాలెంట్‌ను ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. నీ రెండో ఇన్నింగ్స్‌కు గుడ్ లక్’’ అని ట్వీట్ చేశారు.

కాగా వరల్డ్‌కప్‌ కోసం నాలుగో స్థానం అంబటి రాయుడుకు ఫిక్స్ అవుతుందని అందరూ భావించారు. అయితే అనూహ్యంగా ఆ స్థానానికి సెలక్టర్లు విజయ్ శంకర్‌ను ఎంపిక చేయడం.. గాయాలతో శిఖర్ ధావన్, విజయ్ శంకర్ దూరం కాగా వారి స్థానంలోనూ అతడిని ఎంపిక చేయకపోవడంపై రాయుడు అలకబూనాడు. దీంతో తాను అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై చెబుతున్నట్లు ప్రకటించాడు.