టీఆర్ఎస్ కార్యకర్త అత్యుత్సాహం.. పోలింగ్ బూతులోనే..!

|

Jan 22, 2020 | 2:34 PM

తెలంగాణ మునిసిపల్ ఎన్నికల్లో ఓ టీఆర్ఎస్ కార్యకర్త ప్రదర్శించిన అత్యుత్సాహం అతన్ని కటకటాల వెనక్కి నెట్టింది. పోలీసుల మందలింపునకు గురయ్యాడు ఆ టీఆర్ఎస్ వర్కర్. బుధవారం నిజామాబాద్ జిల్లా భీంగల్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. భీంగల్ మున్సిపల్ ఎన్నికల్లో భానుచందర్ అనే టీఆర్ఎస్ వర్కర్ ఓటు వేసేందుకు వెళ్ళాడు. పోలింగ్ బూతులో అంతా సవ్యంగా జరిగిపోయింది. అయితే బయటికి వచ్చిన భానుచందర్ తాను ఓటు వేసిన బ్యాలెట్ పేపర్‌ను ఫోటో తీసుకున్నాడు. తాను తన పార్టీ టీఆర్ఎస్ […]

టీఆర్ఎస్ కార్యకర్త అత్యుత్సాహం.. పోలింగ్ బూతులోనే..!
Follow us on

తెలంగాణ మునిసిపల్ ఎన్నికల్లో ఓ టీఆర్ఎస్ కార్యకర్త ప్రదర్శించిన అత్యుత్సాహం అతన్ని కటకటాల వెనక్కి నెట్టింది. పోలీసుల మందలింపునకు గురయ్యాడు ఆ టీఆర్ఎస్ వర్కర్. బుధవారం నిజామాబాద్ జిల్లా భీంగల్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది.

భీంగల్ మున్సిపల్ ఎన్నికల్లో భానుచందర్ అనే టీఆర్ఎస్ వర్కర్ ఓటు వేసేందుకు వెళ్ళాడు. పోలింగ్ బూతులో అంతా సవ్యంగా జరిగిపోయింది. అయితే బయటికి వచ్చిన భానుచందర్ తాను ఓటు వేసిన బ్యాలెట్ పేపర్‌ను ఫోటో తీసుకున్నాడు. తాను తన పార్టీ టీఆర్ఎస్ గుర్తు అయిన కారుపైనే ముద్ర వేశానంటూ ప్రూఫ్‌గా ఫోటో తీసుకున్నాడు. అంతటితో ఊరుకోకుండా.. అతను ఆ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. భాను చందర్ బ్యాలెట్ పేపర్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా వేలాది మందికి చేరిపోయింది.

సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన భానుచందర్ బ్యాలెట్ పేపర్ ఫోటో పోలీసుల దాకా చేరింది. దాంతో వారు రంగంలోకి దిగారు. ఓటు వేసిన బ్యాలెట్ పేపర్‌ని ఎవరూ బహిర్గతం చేయకూడదు. అందుకు భిన్నంగా అత్యుత్సాహంతో వ్యవహరించిన భాను చందర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చివరికి టీఆర్ఎస్ పార్టీ నేతలు జోక్యం చేసుకుని, తెలియక చేసినట్లు పోలీసులను కన్విన్స్ చేయడంతో వారు స్టేషన్ బెయిల్ మీద విడిచిపెట్టారు.