Rajyasabha candidates: టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థులు వీరే

ఎట్టకేలకు టీఆర్ఎస్ తమ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించింది. టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా వున్న సీనియర్ నాయకుడు కే.కేశవరావును మరోసారి రాజ్యసభకు పంపాలని తీర్మానించారు గులాబీ బాస్. ఆయనతోపాటు నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ స్పీకర్ సురేశ్ రెడ్డిని మరో అభ్యర్థిగా కేసీఆర్ ఎంపిక చేశారు.

Rajyasabha candidates: టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థులు వీరే

Updated on: Mar 12, 2020 | 6:55 PM

TRS Rajyasabha candidates announced: ఎట్టకేలకు టీఆర్ఎస్ తమ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించింది. టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా వున్న సీనియర్ నాయకుడు కే.కేశవరావును మరోసారి రాజ్యసభకు పంపాలని తీర్మానించారు గులాబీ బాస్. ఆయనతోపాటు కేకేతోపాటు.. నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్ రెడ్డి అభ్యర్థిత్వంపై కేసీఆర్ మొగ్గు చూపారు. ఈ మేరకు గురువారం వీరిద్దరి అభ్యర్థిత్వాలను ఖరారు చేశారు.

సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీలో కొనసాగి.. పీసీసీ అధ్యక్షునిగా కూడా పని చేసిన కే.కేశవరావును ఆరేళ్ళ క్రితం తొలిసారి రాజ్యసభకు పంపారు గులాబీ దళపతి. ఆయనకు రెన్యువల్ వస్తుందా లేదా అంటూ గత నెల రోజులుగా పలు కథనాలు మీడియాలో వచ్చాయి. ఈ నేపథ్యంలో పార్టీ ఎంపీలకు కేకే మార్గదర్శకత్వం అవసరమని భావించిన కేసీఆర్.. కేకే పేరును ఖరారు చేసినట్లు సమాచారం. కేకే నిజామాబాద్ జిల్లాకు చెందిన వారు కాగా.. అదే జిల్లాకు చెందిన మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్ రెడ్డికి రాజ్యసభకు పోటీ చేసే ఛాన్స్ కలిపించారు గులాబీ దళపతి.

తెలంగాణ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించిన కేవీపీ రామచంద్రరావు, గరికపాటి మోహన్ రావులిద్దరు పదవీ విరమణ చేస్తున్న నేపథ్యంలో ఏర్పడిన రెండు ఖాళీలకు ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. మార్చి 13తో నామినేషన్ల పర్వం ముగుస్తున్నందున ఇంకా ఒక రోజు మాత్రమే మిగిలిన తరుణంలో టీఆర్ఎస్ పార్టీలో ఉత్కంఠ ఏర్పడింది. రాజ్యసభ టిక్కెట్ కోరుకున్న వారి సంఖ్య పదికి పైగానే వుండడంతో ఎవరికి అవకాశం దక్కుతుందన్న ఉత్కంఠకు కేసీఆర్ తెరదించారు. కే.కేశవరావు, సురేశ్ రెడ్డి అభ్యర్థిత్వాలను ఖరారు చేశారు. వీరిలో కేకే బీసీ (మున్నూరు కాపు) సామాజిక వర్గానికి చెందిన వారు కాగా.. సురేశ్.. ఓసీ (రెడ్డి) సామాజిక వర్గానికి చెందిన వారు. 

నిజామాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గానికి జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల కోసం మాజీ స్పీకర్ సురేశ్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్లు ఒక దశలో ప్రచారం జరిగింది. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్‌గా వ్యవహరించారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన సురేశ్ రెడ్డి.. కొంత కాలం క్రితం కాంగ్రెస్ పార్టీని వీడి గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. కేశవరావు, సురేశ్ రెడ్డి మార్చి 13న మధ్యాహ్నం 12 గం.ల 41 ని.లకు నామినేషన్ వేసేందుకు రెడీ అవుతున్నారు. వీరి అభ్యర్థిత్వం ఖరారు కాగానే కేకే, సురేశ్ రెడ్డి నేరుగా అసెంబ్లీకి వెళ్ళి నామినేషన్ పేపర్లను కలెక్ట్ చేసుకున్నారు. అక్కడే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రులు ప్రశాంత్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డిలతో భేటీ అయ్యారు. పలువురు వీరిద్దరికి శుభాకాంక్షలు తెలిపారు.