TRS Leaders Take Oath : రాజ్యసభకు ఎంపికైన ఇద్దరు టీఆర్ఎస్ ఎంపీలు ప్రమాణం చేశారు. కే కేశవరావు, ఆర్ సురేష్ రెడ్డి రాజ్యసభ సభ్యులుగా ప్రమాణస్వీకారం చేశారు. వీరిద్దరి చేత రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు ప్రమాణస్వీకారం చేయించారు.
టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత కె.కేశవరావు తెలుగు ప్రమాణం చేయగా, అసెంబ్లీ మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి ఇంగ్లీష్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. సురేశ్ రెడ్డి ప్రమాణస్వీకారం అనంతరం వెంకయ్యనాయుడు స్పందించారు. సురేష్ రెడ్డి మాజీ స్పీకర్ అని వెంకయ్య సభకు తెలియజేశారు. ఇటీవల కొత్తగా ఎన్నికైన సభ్యులతో రాజ్యసభ ఛైర్మన్ ప్రమాణస్వీకారం చేశారు.