రాజీవ్ గాంధీకి సోనియా, రాహుల్ నివాళి..

|

Aug 20, 2019 | 2:02 PM

మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ 75 వ జయంతి సందర్భంగా మంగళవారం ఆయన సతీమణి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నివాళులు అర్పించారు. ఢిల్లీలోని రాజీవ్ గాంధీ స్మారక ప్రాంతమైన వీర్ భూమి వద్ద సోనియాతో బాటు రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక గాంధీ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తన తండ్రిని గుర్తు చేసుకున్న రాహుల్.. అందర్నీ గౌరవించడం, ప్రేమించడమే ఆయన తమకు నేర్పించారని ట్వీట్ చేశారు. అటు-మాజీ ప్రధాని మన్మోహన్ […]

రాజీవ్ గాంధీకి సోనియా, రాహుల్ నివాళి..
Follow us on

మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ 75 వ జయంతి సందర్భంగా మంగళవారం ఆయన సతీమణి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నివాళులు అర్పించారు. ఢిల్లీలోని రాజీవ్ గాంధీ స్మారక ప్రాంతమైన వీర్ భూమి వద్ద సోనియాతో బాటు రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక గాంధీ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తన తండ్రిని గుర్తు చేసుకున్న రాహుల్.. అందర్నీ గౌరవించడం, ప్రేమించడమే ఆయన తమకు నేర్పించారని ట్వీట్ చేశారు. అటు-మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ తదితరులు కూడా రాజీవ్ కు శ్రధ్ధాంజలి ఘటించారు. రెండు నిముషాలు మౌనం పాటించారు.
కాగా-వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేతలు.. దేశానికి రాజీవ్ చేసిన సేవలను కొనియాడారు. హైదరాబాద్ లో సోమాజీగూడ వద్ద నేతలు రాజీవ్
75 వ జయంతి వేడుకలను నిర్వహించారు. పలు ప్రాంతాలనుంచి సద్భావన ర్యాలీగా వఛ్చినవారికి మాజీ ఎంపీ హనుమంతరావు, మాజీ మంత్రి షబ్బీర్ అలీ తదితరులు స్వాగతం పలికారు.