గిరిజన మహిళల ఆర్థిక స్వావలంబనే లక్ష్యం, తెలంగాణలో పెద్దఎత్తున ‘ట్రైబల్ డిజిటల్ లీడర్ షిప్’ కార్యక్రమం అమలు

|

Jan 23, 2021 | 4:21 PM

తెలంగాణ గిరిజన మహిళలు డిజిటల్ రంగంలో అందరితో పోటీపడేలా చేయడమే లక్ష్యంగా ట్రైబల్ డిజిటల్ లీడర్ షిప్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని...

గిరిజన మహిళల ఆర్థిక స్వావలంబనే లక్ష్యం, తెలంగాణలో పెద్దఎత్తున ట్రైబల్ డిజిటల్ లీడర్ షిప్ కార్యక్రమం అమలు
Minister Satyavathi rathod
Follow us on

తెలంగాణ గిరిజన మహిళలు డిజిటల్ రంగంలో అందరితో పోటీపడేలా చేయడమే లక్ష్యంగా ట్రైబల్ డిజిటల్ లీడర్ షిప్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని రాష్ట్ర గిరిజన, స్త్రీశిశు సంక్షేమశాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఇందులో ఇందులో భాగంగా గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఇప్పటికే 150 మంది మహిళలకు డిజిటల్ పరికరాలపై శిక్షణ ఇచ్చామని ఆమె తెలిపారు. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్‌లోని దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్‌లో ఆమె మాట్లాడారు. విద్య ఒకటే సమాజంలోని అసమానతలు తగ్గిస్తుందని భావించిన సీఎం కేసీఆర్ విద్యాభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారని ఆమె చెప్పుకొచ్చారు. దళితులు, గిరిజనులు, పేదల అభ్యున్నతికి కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులు అవసరమన్న ఆమె, డిజిటల్ లీడర్‌ షిప్ ప్రోగ్రాంలో మరింత మంది భాగస్వామ్యం కావాలని ఆమె పిలుపునిచ్చారు.