దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో కోవిడ్-19 సోకని, ఇతర వ్యాధిగ్రస్థులకు వైద్య చికిత్స చేయడానికి నిరాకరించే వైద్యులపై చర్యలు తీసుకుంటామని కర్ణాటక వైద్య మండలి (కేఎంసీ) తెలిపింది. ఇటువంటి వైద్యులపై మెడికల్ ఎథిక్స్ కోడ్ ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ మేరకు సర్క్యులర్ జారీ చేసినట్లు హైకోర్టుకు శుక్రవారం తెలిపింది. బాధిత రోగులు ఫిర్యాదు చేసేందుకు హెల్ప్‌లైన్ ఫోన్ నంబర్లను కూడా ప్రకటించినట్లు హైకోర్టుకు తెలిపింది. బాధిత రోగులు 9916302328/080-22200888 నంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చునని తెలిపింది.
మరోవైపు.. కేఎంసీ తన వద్ద నమోదు చేసుకున్న మెడికల్ ప్రాక్టీషనర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఆసుపత్రులు, క్లినిక్‌లను మూసివేయరాదని తెలిపింది. వృత్తిపరమైన ప్రవర్తనా నియమావళికి అనుగుణంగా నాన్ కోవిడ్ పేషెంట్స్‌కు పరీక్షలు నిర్వహించి, చికిత్స చేయాలని తెలిపింది. నాన్ కోవిడ్ పేషెంట్స్‌కు చికిత్స నిరాకరించరాదని విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం ప్రైవేటు ఆసుపత్రులకు ఆదేశాలు జారీ చేసినట్లు ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.
Read More: