ఏపీ రవాణా శాఖ కొత్త యాక్షన్ ప్లాన్

|

Apr 24, 2020 | 5:53 PM

కరోనా నేపధ్యంలో ఏపీలో యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది రవాణా శాఖా. కేవలం ప్రభుత్వం అనుమతి ఇచ్చిన అత్యవసర వాహనాలకు మాత్రమే అనుమతివ్వాలని నిర్ణయించింది. ప్రతి జిల్లాలో ప్రత్యేక టీంలను ఏర్పాటు చేయాలని తలపెట్టారు. రవాణా శాఖ తాజాగా నిర్దేశించిన రూల్స్‌ని అతిక్రమించిన వారిపై మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం కేసులు చేయాలని నిర్ణయించారు.

ఏపీ రవాణా శాఖ కొత్త యాక్షన్ ప్లాన్
Follow us on

కరోనా నేపధ్యంలో ఏపీలో యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది రవాణా శాఖా. కేవలం ప్రభుత్వం అనుమతి ఇచ్చిన అత్యవసర వాహనాలకు మాత్రమే అనుమతివ్వాలని నిర్ణయించింది. ప్రతి జిల్లాలో ప్రత్యేక టీంలను ఏర్పాటు చేయాలని తలపెట్టారు. రవాణా శాఖ తాజాగా నిర్దేశించిన రూల్స్‌ని అతిక్రమించిన వారిపై మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం కేసులు చేయాలని నిర్ణయించారు.

అనుమతి తీసుకున్న అత్యవసర కారులో డ్రైవర్ కాకుండా ఇంకొకరు మాత్రమే ప్రయాణం చేసే అవకాశం కల్పిస్తున్నారు. ఆ ఒక్కరు కూడా డ్రైవర్ పక్క సీటులో కాకుండా వెనకాల వుండే సీటులో కూర్చుని ప్రయాణా చేయాల్సి వుంటుంది. అనుమతి పొందిన బైక్ మీద కూడా ఒక్కరే ప్రయాణం చేయాల్సి వుంటుంది. అన్ని గూడ్స్ వాహనాలకు అనుమతినివ్వాలని నిర్ణయించారు. ఖాళీగా తిరిగే గూడ్స్ వాహనాలను అనుమతిస్తారు.

గూడ్స్ వాహనాలకు ఇబ్బంది ఉంటే రాష్ట్ర కంట్రోల్ రూంని సంప్రదించాల్సి వుంటుంది. లారీ ఓనర్స్‌తో సమావేశమై వారికి అవగాహన కల్పించాలని రవాణా శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. హైవేపై ట్రక్ రిపేర్ షాపులు, దాబాలు, లేబర్ ట్రాన్స్పోర్ట్ లాంటి అంశాల ఏర్పాటుకు జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకోవాలని తెలిపారు. ప్రతి వాహనాన్ని ఒక శాతం హైపో క్లోరైట్ సొల్యూషన్‌తో శానిటైజ్ చేయాలని నిర్దేశించారు. ప్రతి వాహనానికి డ్రైవర్ ప్రొటెక్షన్ కిట్స్ అందిస్తామని అని రవాణా శాఖ అధికారులు తెలిపారు.