
సార్వత్రిక ఎన్నికల కోసం ఎన్నికల సంఘం పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. అంతేకాదు దేశ ఎన్నికల చరిత్రలోనే తొలిసారిగా గౌరీ సావంత్ అనే ఒక ట్రాన్స్ జెండర్ ను ఎన్నికల ప్రచారకర్తగా నియమించారు. సెక్స్ వర్కర్స్ కు ఓటింగ్ పై అవగాహన కల్పించాలని, అన్ని రకాల మహిళలు ఎన్నికల్లో పాల్గొనేలా ప్రేరేపించడానికి అంబాసిడర్లను మహారాష్ట్ర ఎన్నికల సంఘం నియమించారు. మొత్తం 12 మంది ప్రచారకర్తలు కాగా.. అందులో సావంత్ ఒకరు. సెక్స్ వర్కర్స్ గురించి ఏ పార్టీ కూడా తమ అజెండాలో చేర్చదని.. అలాంటి వారికీ ఓటింగ్ పట్ల అవగాహన కల్పిస్తానని.. వారికి ఉన్న రాజ్యాంగబద్ధమైన ఓటు హక్కుని వినియోగించుకుని ప్రభుత్వం ఏర్పడేలా దోహదపడతానని సావంత్ స్పష్టం చేశారు.