ఇద్దరు బాలికల ప్రాణాలను మింగిన వ్యవసాయ బావి

ఖమ్మం జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఖమ్మం రూరల్ మండలం మంగళగూడెంలో ఈత సరదా ఇద్దరు చిన్నారుల ప్రాణాలను బలితీసుకుంది. మంగళగూడెం పరిధిలోని ఓ వ్యవసాయ బావిలో ప్రమాదవశాత్తు పడి ఇద్దరు బాలికలు మృతి చెందారు.

ఇద్దరు బాలికల ప్రాణాలను మింగిన వ్యవసాయ బావి

Updated on: Aug 31, 2020 | 7:20 PM

ఖమ్మం జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఖమ్మం రూరల్ మండలం మంగళగూడెంలో ఈత సరదా ఇద్దరు చిన్నారుల ప్రాణాలను బలితీసుకుంది. మంగళగూడెం పరిధిలోని ఓ వ్యవసాయ బావిలో ప్రమాదవశాత్తు పడి ఇద్దరు బాలికలు మృతి చెందారు. మృతులిద్దరిది మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం హరిశ్చంద్రుడు తండాగా గుర్తించారు. ఖమ్మం రూరల్ మండలం మంగళగూడెం పరిధిలోని హరిశ్చంద్రుడు తండా రెండు జిల్లాలకు సరిహద్దుగా ఉంది. అయితే, ఇద్దరు బాలికలు బావిలో ఈత కొట్టేందుకు బావిలోకి దిగారు. ప్రమాదవశాత్తులో బావిలో కురుక్కుపోయిన చిన్నారులు ప్రాణాలను కోల్పోయారని స్థానికులు చెప్పారు. బాలికల మృతితో వారి తల్లిదండ్రులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమ్మితం ఖమ్మం ఆస్పత్రికి తరలించారు.ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న ఖమ్మం రూరల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Loading...
Unable to load recommendations.
Follow Us