బావ-బావమరిదిల సరదా ప్రాణాల మీదికి తెచ్చింది..!

|

Jul 01, 2020 | 10:11 PM

బావ-బావమరిదుల సరదా ఓ కుటుంబాన్నే ఆస్పత్రి పాలు చేసింది. ఆట పట్టించేందుకు ఆకు కూరగా చెప్పి గంజాయి ఇచ్చాడు. అదేంటో తెలియని కుటుంబం వంట చేసుకుని తిని అస్వస్థతకు గురైంది. అసలు విషయం తెలిసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది.

బావ-బావమరిదిల సరదా ప్రాణాల మీదికి తెచ్చింది..!
Follow us on

బావ-బావమరిదుల సరదా ఓ కుటుంబాన్నే ఆస్పత్రి పాలు చేసింది. ఆట పట్టించేందుకు ఆకు కూరగా చెప్పి గంజాయి ఇచ్చాడు. అదేంటో తెలియని కుటుంబం వంట చేసుకుని తిని అస్వస్థతకు గురైంది. అసలు విషయం తెలిసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది.

కన్నౌజ్‌ పరిధిలోని మియాగంజ్ గ్రామానికి చెందిన ఓ ఓం ప్రకాష్.. తన ఇంటికి వచ్చిన బావమరిదిని సరదా ఆటపట్టించాలనుకున్నాడు. బావమరిదికి మెంతికూర పొడి అని చెప్పి గంజాయి పొడి ఇచ్చాడు. ఇది కూరలో కలిపుకుని వండుకుని తినండని ఉచిత సలహా ఇచ్చాడు. అతను ఇచ్చింది నిజమేనని నమ్మిన బావమరిది ఇంటికి తీసుకెళ్లి వారు తేడా తెలియక దాన్ని కూరలో వేసి వండేశారు. అయితే, ఆ కూర‌ తిన్న కుటుంబ స‌భ్యులు ఒక్కొక్కరిగా స్పృహ‌త‌ప్పి ప‌డిపోయారు. ఇది గమనించిన స్థానికులు వెంట‌నే పోలీసుల‌కు సమాచారమిచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు బాధితులను హుటాహుటీన ఆసుప‌త్రికి త‌ర‌లించారు. సకాలంలో ఆస్పత్రిలో చేర్చడంతో అంతా క్షేమంగా బయటపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టడంతో అసలు విషయం బయటపడింది. ఇందుకు కారణమైన బావ ఓం ప్రకాష్ ను అరెస్ట్ చేసిన పోలీసులు గంజాయి ఎలా వచ్చిందన్న దానిపై ఆరా తీస్తున్నారు.