టాప్ 10 న్యూస్ @ 6PM

|

Apr 28, 2019 | 6:15 PM

1.రెండు తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న ‘ఫొని’ తుఫాన్ రెండు తెలుగు రాష్ట్రాలకు తుఫాన్ ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫాన్‌గా మారింది.. ఇక ఈ తుఫాన్‌కు ‘ఫొని’ అని నామకరణం చేసింది వాతావరణ శాఖ….Read More 2.ఫొని ఎఫెక్ట్ : తమిళనాడుకు రెడ్ అలర్ట్ బంగాళాఖాతంలో ఏర్పడిన ఫణి తుఫాన్ ఉత్తర తమిళనాడు దిశగా ముంచుకొస్తుంది. సాయంత్రానికి తీవ్ర తుఫాన్‌గా మారనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరిస్తుండగా.. ఈనెల 30న […]

టాప్ 10 న్యూస్ @ 6PM
Follow us on

1.రెండు తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న ‘ఫొని’ తుఫాన్

రెండు తెలుగు రాష్ట్రాలకు తుఫాన్ ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫాన్‌గా మారింది.. ఇక ఈ తుఫాన్‌కు ‘ఫొని’ అని నామకరణం చేసింది వాతావరణ శాఖ….Read More

2.ఫొని ఎఫెక్ట్ : తమిళనాడుకు రెడ్ అలర్ట్

బంగాళాఖాతంలో ఏర్పడిన ఫణి తుఫాన్ ఉత్తర తమిళనాడు దిశగా ముంచుకొస్తుంది. సాయంత్రానికి తీవ్ర తుఫాన్‌గా మారనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరిస్తుండగా.. ఈనెల 30న ఉత్తర తమిళనాడు దిశగా రానుందని అంచనా వేస్తున్నారు..Read More

3.బ్రేకింగ్: పేలుళ్ల సూత్రధారి తండ్రి, సోదరులు హతం!

కొలంబో: శ్రీలంక పేలుళ్ల సూత్రధారిగా భావిస్తున్న నేషనల్‌ తౌవీద్‌ జమాత్‌ ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు జహ్రామ్‌ హషీమ్‌.. తండ్రి, ఇద్దరు సోదరులు మృతి చెందినట్లు ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్‌ పేర్కొంది….Read More

4.బ్రేకింగ్ : ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు వాయిదా

మే16వ తేదీ నుంచి జరగాల్సిన ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు వాయిదా పడ్డాయి. మే 16కు బదులుగా మే 25వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు…Read More

5. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో వర్మను అడ్డుకున్న పోలీసులు

గన్నవరం :ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు పూర్తి అవ్వడంతో ఎట్టకేలకు వర్మ తెరకెక్కించిన ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ సినిమా విడుదల అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మూవీని ప్రమోట్ చేసేందుకు విజయవాడలో ప్రెస్‌మీట్‌ పెట్టేందుకు సిద్ధమయ్యాడు వర్మ….Read More

6.మోదీపై దీదీ సంచలన వ్యాఖ్యలు..!

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ పార్టీ చిత్రహింసలకు గురి చేయడం వల్లే ఎంపీ సుల్తాన్ అహ్మద్ చనిపోయారని త్రిణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపించారు….Read More

7.తెలుగు సినీ నటుడు బోస్ మృతి

ప్రముఖ సినీ, టీవీ నటుడు సుభాష్ చంద్రబోస్ అలియాస్ బోస్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.  నాలుగు రోజుల క్రితం కృష్ణానగర్లోని తన ఇంట్లో ప్రమాదవశాత్తు జారిపడిన బోస్ తలకు తీవ్ర గాయమైంది. Read More

8.’కామ్రేడ్’ ముగించేశాడు

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా కలిసి నటిస్తున్న చిత్రం ‘డియర్ కామ్రేడ్’. నూతన దర్శకుడు భరత్ కమ్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. గతేడాది సెట్స్ మీదకు వెళ్లిన ఈ చిత్రం షూటింగ్ ఈరోజుతో పూర్తయినట్లు సమాచారం…Read More

9.ప్రణయ్ హత్యకేసులో మారుతీరావు విడుదల

మిర్యాలగూడలో తీవ్ర సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్యకేసులో ప్రధాన నిందితుడు, అమృత తండ్రి మారుతీరావు జైలు నుంచి విడుదలయ్యాడు. ఉదయం వరంగల్ సెంట్రల్ జైలు నుంచి ఆయన బెయిల్‌పై బయటకొచ్చాడు. …Read More

10.పాల్ రేంజ్ చూశారా!..రాజపక్సేతో భేటీ..పేలుళ్ల ఘటనలపై చర్చలు

వరుస బాంబు పేలుళ్లతో వణికిపోయిన శ్రీలంకలో ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ. పాల్ పర్యటిస్తున్నారు. ఈస్టర్ పండుగ సందర్భంగా జరిగిన వరుస బాంబు పేలుళ్లలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రుల పాలైన బాధితులను పరామర్శించేందుకు కేఏ పాల్ శ్రీలంకకు పయనమై వెళ్లిన సంగతి తెలిసిందే…Read More