హ్యాండ్ శానిటైజర్ అతిగా వాడుతున్నారా..?

| Edited By:

May 28, 2020 | 5:47 PM

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. కరోనా భయంతో అంతా వ్యక్తిగత శుభ్రతపై దృష్టిసారించారు. వీలైనన్ని ఎక్కువ సార్లు చేతులు కడుగుతున్నారు.

హ్యాండ్ శానిటైజర్ అతిగా వాడుతున్నారా..?
Follow us on

Use of Sanitizer: కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. కరోనా భయంతో అంతా వ్యక్తిగత శుభ్రతపై దృష్టిసారించారు. వీలైనన్ని ఎక్కువ సార్లు చేతులు కడుగుతున్నారు. ఇక, మాస్క్‌లు, హ్యాండ్ శానిటైర్ల వినియోగం పెరిగిపోయింది. చేతులు కడగడం సాధ్యం కానివారంతా హ్యాండ్‌ శానిటైజర్‌ను వాడుతున్నారు. అంతేకాదు.. కొందరు చేతులు కడగడంతో పాటు.. శానిటైజర్‌ను కూడా వాడేస్తున్నారట..!

కాగా.. శానిటైజర్‌ను ఎక్కువగా వాడినా ప్రమాదం పొంచి ఉన్నట్టే అంటున్నారు నిపుణులు. శానిటైజర్లను అతిగా వాడడం వల్ల చర్మ సంబంధమైన సమస్యలు వస్తాయంటున్నారు. పరిశుభ్రమైన నీరు, సబ్బుతోనే చేతులు కడుక్కోవడం ఉత్తమం అంటున్నారు. కరోనా విషయంలో జనం భయాందోళన చెందాల్సిన అవసరం కూడా లేదంటున్నారు మానసిక నిపుణులు. మానసికంగా ఆరోగ్యంగా ఉంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుందనే విషయం మర్చిపోకూడదన్నది నిపుణుల సూచన.

మరోవైపు.. శరీరంలో రోగనిరోధక శక్తిని పెరగడానికి ఎక్కువ నిమ్మకాయ రసం తాగడం, సి విటమిన్‌ అధికంగా ఉంటే నారింజ వంటి పండ్లను తినాలని సూచిస్తున్నారు. శీతల పానీయాలు, ఐస్‌క్రీమ్‌లు వంటి వాటికి దూరంగా ఉండాలని చెబుతున్నారు నిపుణులు. ఏదైనా పరిమితంగా చేయాలి… మరీ అదేపనిగా శానిటైజర్లు వాడితే.. కొత్త సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.