దేశంలోని ప్రముఖుల నుంచి సామాన్య ప్రజలను మిగేస్తోంది మహమ్మారి కరోనా. ఈ వైరస్ ప్రభావంతో ఇప్పటికే చాలా మంది ప్రముఖులు మృత్యువాత పడ్డారు. ఇదే వరుసలో ఇప్పుడు భారత అథ్లెటిక్స్ సమాఖ్య (IFI) మెడికల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ అరుణ్ కుమార్ మెండిరటా కన్నుమూశారు. గత కొన్ని రోజుల క్రితం కరోనాతో ఆసుపత్రిలో చేరిన డాక్టర్ అరుణ్ చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచినట్లు ఏఎఫ్‌ఐ ప్రకటనలో పేర్కొంది.
ఇటీవల టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత టీమ్‌కు చీఫ్ మెడికల్ ఆఫీసర్‌గా భారత ఒలింపిక్ సంఘం అరుణ్‌ను నియమించింది. దీంతో ఆయన భారత క్రీడాకారుల బృందంతోపాటు టోక్యోకు వెళ్లాల్సి ఉంది. గత 25 ఏళ్లుగా అరుణ్ ఆసియా అథ్లెటిక్స్ సంఘంలో పని చేస్తున్నారు. ఆయన డాక్టర్ మెండిరటాగా చాలా మంద్రి క్రీడాకారులకు సుపరిచితం. “మృదువుగా మాట్లాడే డాక్టర్ మెండిరట్టా అథ్లెటిక్స్ సంఘం కోల్పోయిందని IFI పేర్కొంది. అంతే కాదు క్రీడాకారులను వెన్ను తట్టి ఉత్సాహపూరితంగా మాట్లాడే ఆయనను తాను కోల్పోయామని క్రీడాకారులు కన్నీటి పర్యతం అయ్యారు. ఆసియా అథ్లెటిక్స్ మరియు భారతీయ క్రీడలతో చురుకుగా పాల్గొనేవారు. స్పోర్ట్స్ మెడిసిన్ మరియు డోపింగ్ నియంత్రణకు 3 దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నారు.