
దేశంలో వెండి ధర పెరుగుతు… పెరుగుతు… ఆకాశాన్ని అంటుతోంది. కేవలం వారం, పది రోజుల వ్యవధిలో కిలో వెండి ధర దాదాపు 4700 రూపాయల మేరకు పెరిగింది. ఈ ధరల పెరుగుదల ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి నమోదవుతూ వస్తోంది. నేడు హైదరాబాద్‌లో కేజీ సిల్వర్ ధర రూ.71,600 లకు చేరింది. ప్రస్తుతం తులం వెండి రూ.716గా నడుస్తోంది. ఒక గ్రాము వెండి రూ.71.60 గా ఉంది. రానున్న రోజుల్లో వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వాణిజ్యరంగ నిపుణులు చెబుతున్నారు.
కాగా, డిసెంబర్ నెల 14న కిలో వెండి ధర రూ.63,200 కాగా డిసెంబర్ 15న కిలో వెండి ధర రూ. 67, 900లుగా నమోదైంది. అంటే డిసెంబర్ నెలలోనే అత్యధిక ధరల పెరుగుదలను నమోదు చేసింది. వారం రోజుల్లో రోజు రోజుకు వెండి ధర పెరిగిందే తప్ప ఒక్క రూపాయి తగ్గకపోవడం గమనార్హం.