Today Silver Price: వెండి ధరల్లో క్షీణత సోమవారం కూడా కొనసాగింది. అయితే దక్షిణాదిలో వెండి ధరల్లో మార్పు లేకపోయినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం భారీగా వెండి ధరలు పతనమయ్యాయి. తాజాగా సోమవారం కిలో వెండి ధర ఎంత పలుకుతుందో ఇప్పుడు చూద్దాం..
దేశ రాజధాని న్యూఢిల్లీలో సోమవారం కిలో వెండి ధర రూ. రూ. 65,000 వద్ద (ఎలాంటి మార్పు లేదు) కొనసాగుతోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలోనూ కిలో వెండి రూ. 65,000 వద్ద కొనసాగుతోంది.
ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఆదివారంతో పోలీస్తే.. కిలో వెండిపై ఏకంగా రూ. 4,700 తగ్గి.. ప్రస్తుతం రూ. 65,000గా ఉంది. విజయవాడలోనూ కిలో వెండి రూ. 65,000గా ఉంది. ఇక విశాఖపట్నం విషయానికొస్తే.. ఇక్కడ కూడా ఇదే ధర కొనసాగుతోంది.