ఈ రోజు టీఎస్‌ లా సెట్‌, పీజీ ఎల్‌సెట్‌ 2020 పరీక్షలు

టీఎస్‌ లా సెట్‌, పీజీ ఎల్‌సెట్‌ 2020 పరీక్షలు ఈ రోజు జరగనున్నాయి. రెండు సెషన్లలో 30,310 అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. మూడు సంవత్సరాల డిగ్రీ కోర్సుకు 21,925 మంది అభ్యర్థులు నమోదు చేసుకున్నారు. ఎల్‌ఎల్‌కు హాజరు కావడానికి....

ఈ రోజు టీఎస్‌ లా సెట్‌, పీజీ ఎల్‌సెట్‌ 2020 పరీక్షలు

Updated on: Oct 09, 2020 | 5:44 AM

Law Cet TS టీఎస్‌ లా సెట్‌, పీజీ ఎల్‌సెట్‌ 2020 పరీక్షలు ఈ రోజు జరగనున్నాయి. రెండు సెషన్లలో 30,310 అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. మూడు సంవత్సరాల డిగ్రీ కోర్సుకు 21,925 మంది అభ్యర్థులు నమోదు చేసుకున్నారు. ఎల్‌ఎల్‌కు హాజరు కావడానికి ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ లా డిగ్రీ కోర్సుకు 569,1 మంది అభ్యర్థులు, ఎల్‌ఎల్‌ఎం‌కు 2691 మంది అభ్యర్థులు నమోదు చేసుకున్నారని అధికారులు వెల్లడించారు.

టీఎస్ లాసెట్  మూడు సంవత్సరాల డిగ్రీ కోర్సుకు ఈ ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం వరకు.. టీఎస్ లాసెట్ 5 సంవత్సరాల డిగ్రీ కోర్సు & టీఎస్ పీసీఎల్‌సీఈటీకి మధ్యాహ్నం 03.00 నుండి 04:30 వరకు పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 67 టెస్ట్ సెంటర్లలో పరీక్షలు నిర్వస్తున్నారు. తెలంగాణలో 63, ఆంధ్రప్రదేశ్‌లో 04 సెంటర్లలో పరీక్షలు జరగనున్నాయి.