ఏపీ చట్టసభల చరిత్రలో ఈ రోజు బ్లాక్‌ డే: బుగ్గన

| Edited By: Srinu

Jan 23, 2020 | 4:55 PM

శాసనమండలి చైర్మన్ వికేంద్రీకరణ, సిఆర్‌డిఎ (రద్దు) చట్టం బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించారు. దీనిపై ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇది బ్లాక్‌ డే అని నొక్కి చెప్పారు. శాసనమండలి ఛైర్మన్‌ ప్రతిపక్ష పార్టీ సభ్యుల ప్రభావానికి లోనయ్యారని మంత్రి తెలిపారు. టిడిపి కౌన్సిల్ నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించిందని మంత్రి ఆరోపించారు. చంద్రబాబు లాబీల్లో కూర్చుని శాసనమండలి చైర్మన్‌ను ప్రభావితం చేశారని మంత్రి ఆరోపించారు. రాష్ట్రాభివృద్ధి కోసం ఎన్నో కమిటీలను అధ్యయనం […]

ఏపీ చట్టసభల చరిత్రలో ఈ రోజు బ్లాక్‌ డే: బుగ్గన
Follow us on

శాసనమండలి చైర్మన్ వికేంద్రీకరణ, సిఆర్‌డిఎ (రద్దు) చట్టం బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించారు. దీనిపై ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇది బ్లాక్‌ డే అని నొక్కి చెప్పారు. శాసనమండలి ఛైర్మన్‌ ప్రతిపక్ష పార్టీ సభ్యుల ప్రభావానికి లోనయ్యారని మంత్రి తెలిపారు. టిడిపి కౌన్సిల్ నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించిందని మంత్రి ఆరోపించారు. చంద్రబాబు లాబీల్లో కూర్చుని శాసనమండలి చైర్మన్‌ను ప్రభావితం చేశారని మంత్రి ఆరోపించారు. రాష్ట్రాభివృద్ధి కోసం ఎన్నో కమిటీలను అధ్యయనం చేసిన తర్వాత రాజధాని వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నామని బుగ్గన అన్నారు.