జననాల రేటు పెంచేందుకు జపాన్‌ కొత్త పథకం

|

Oct 26, 2020 | 7:53 PM

జపాన్ పౌరులకు పనంటే పిచ్చి..ఎంతలా అంటే వారు పనిలో పడితే కుటుంబాన్ని సైతం మర్చిపోతారు. ఒక్కసారి ఆఫీసులోకి ఎంటరైతే ఎన్ని గంటలైనా అలా పని చేసుకుంటేనే ఉంటారు.

జననాల రేటు పెంచేందుకు జపాన్‌ కొత్త పథకం
Follow us on

జపాన్ పౌరులకు పనంటే పిచ్చి..ఎంతలా అంటే వారు పనిలో పడితే కుటుంబాన్ని సైతం మర్చిపోతారు. ఒక్కసారి ఆఫీసులోకి ఎంటరైతే ఎన్ని గంటలైనా అలా పని చేసుకుంటేనే ఉంటారు. జపాన్ ప్రజలు పని చేయడంలో పోటీ పడతారు. అందుకోసం ఓవర్‌డ్యూటీలు, నైట్‌ డ్యూటీలు చేస్తారు.  అలా తమ స్థాయిని, పని తీరుని మెరుగుపరుచుకుంటారు. ఈ క్రమంలో వారు విచిత్రమైన సమస్యలను ఎదుర్కుంటున్నారు. వివాహం చేసుకునేందుకు అక్కడి యువత పెద్దగా ఇంట్రస్ట్ చూపడం లేదు. దీంతో ఆ దేశంలో జననాల రేటు భారీగా పడిపోతోంది. గతేడాది జపాన్‌లో కేవలం 8.65 లక్షల మందే జన్మించారు. ఇలా జనన రేటు తగ్గిపోవడం అక్కడి గవర్నమెంట్‌ను కలవరపరుస్తోంది. అందుకే ఈ సమస్యకు పరిష్కారంగా జపాన్‌ ఓ వినూత్న పథకాన్ని శ్రీకారం చుట్టింది.

దేశంలో జననాల రేటు పెరగాలంటే ముందుగా యువత పెళ్లి చేసుకునేలా ప్రోత్సాహించాలని భావించిన జపాన్ సర్కార్‌.. పెళ్లి చేసుకునే జంటలకు నగదును గిఫ్ట్‌గా ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం ఇటీవల ప్రకటన విడుదల చేసింది. వచ్చే ఏడాది ఏప్రిల్‌ నుంచి పెళ్లి చేసుకునే జంటలకు ఆరు లక్షల యెన్‌లు (రూ. 4లక్షలకు పైగా) నగదు గిఫ్ట్‌గా ఇస్తామని ప్రకటించింది. పెళ్లి చేసుకున్న జంట కొత్త లైఫ్ ప్రారంభించడానికి, కొత్తగా ఇల్లు తీసుకొని అద్దె కట్టేందుకు ఈ నగదు ఉపయోగపడుతుందని ప్రభుత్వం పేర్కొంది. ఈ పథకానికి ఆకర్షితులై యువత వివాహాలు చేసుకుని.. పిల్లల్ని కంటే.. దేశంలో మళ్లీ జననాల రేటు పెరుగుతుందన్నది జపాన్‌ సర్కార్ ఆలోచన. ఈ ప్రోత్సాహకం అందాలంటే వధువు, వరుడు తమ పేర్లను రిజిస్టర్‌ చేసుకోవాలి. 40ఏళ్ల వయసు మించకుండా, వార్షికాదాయం 5.4 లక్షల యెన్లకు తక్కువగా ఉన్నవారే ఈ స్కీమ్‌కు అర్హులని ప్రభుత్వం వెల్లడించింది.

Also Read :

ఇది విన్నారా..! భర్తకు భరణం ఇవ్వాలని భార్యను ఆదేశించిన కోర్టు

సినిమాను తలదన్నే సీన్.. చిన్నారిని కాపడటానికి నాన్-స్టాప్‌గా 200 కి.మీ…

ఈ మ్యారేజ్ బ్యూరోలో కేవలం రైతులకు మాత్రమే సంబంధాలు చూడబడును