మోదీకి పరువు నష్టం నోటీసులు!

|

May 19, 2019 | 6:57 AM

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి తన న్యాయవాది ద్వారా పరువు నష్టం నోటీసులు పంపారు. మే 15న డైమండ్ హార్బర్ లో నిర్వహించిన బహిరంగ సభలో తనపై ప్రధాని మోదీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని అభిషేక్ బెనర్జీ ఆరోపించారు.  ఇకపోతే గత కొద్దిరోజులుగా బీజేపీకి, త్రిణమూల్ కాంగ్రెస్‌కి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. కోల్‌కతాలో అమిత్ షా నిర్వహించిన ర్యాలీ సందర్భంగా జరిగిన హింసాకాండ […]

మోదీకి పరువు నష్టం నోటీసులు!
Follow us on

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి తన న్యాయవాది ద్వారా పరువు నష్టం నోటీసులు పంపారు. మే 15న డైమండ్ హార్బర్ లో నిర్వహించిన బహిరంగ సభలో తనపై ప్రధాని మోదీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని అభిషేక్ బెనర్జీ ఆరోపించారు.  ఇకపోతే గత కొద్దిరోజులుగా బీజేపీకి, త్రిణమూల్ కాంగ్రెస్‌కి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది.

కోల్‌కతాలో అమిత్ షా నిర్వహించిన ర్యాలీ సందర్భంగా జరిగిన హింసాకాండ తర్వాత ఎన్నికల సంఘం పశ్చిమ బెంగాల్ లో  చివరి దశ ప్రచారాన్ని ఒక రోజు తగ్గించడం జరిగింది. ఇకపోతే ఎంపీ అభిషేక్ బెనర్జీ డైమండ్ హార్బర్ నుంచి రెండోసారి పోటీ చేస్తున్నారు. అభిషేక్ బెనర్జీ ఈసారి ఎన్నికల్లో ఓడిపోతారని.. ఫలితాలు ప్రకటించిన తర్వాత ఆయన కార్యాలయానికి తాళం పడుతుందని మోదీ తీవ్ర విమర్శలు గుప్పించారు. డైమండ్ హార్బర్ లో మోదీ ‘పశ్చిమ బెంగాల్ లో అత్త-మేనల్లుళ్ల ప్రభుత్వం నడుస్తోందని’ విమర్శించారు. కాగా లోక్ సభ ఎన్నికల తుది సమరం ఇవాళ జరగనుంది. మే 23న లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెలువడతాయి.