AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ సారి తిరుమల, తిరుపతి పోలీసులు బుక్కయ్యారు

ఉభయ తెలుగు రాష్ట్రాలలో పోలీసు అధికారులు, సిబ్బందే టార్గెట్ గా ఓ భారీ సైబర్ స్కామ్ జరుగుతోంది. కేవలం ఖాకీలపై మాత్రమే ఫోకస్ పెడుతూ, వాళ్లకు కొత్త టార్గెట్ విసురుతున్నారు కేటుగాళ్లు.

ఈ సారి తిరుమల, తిరుపతి పోలీసులు బుక్కయ్యారు
Ram Naramaneni
|

Updated on: Sep 26, 2020 | 3:50 PM

Share

ఉభయ తెలుగు రాష్ట్రాలలో పోలీసు అధికారులు, సిబ్బందే టార్గెట్ గా ఓ భారీ సైబర్ స్కామ్ జరుగుతోంది. కేవలం ఖాకీలపై మాత్రమే ఫోకస్ పెడుతూ, వాళ్లకు కొత్త టార్గెట్ విసురుతున్నారు కేటుగాళ్లు. పోలీసుల సోషల్ మీడియా ఖాతాలను హ్యాక్ చేస్తూ..డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా తిరుమల, తిరుపతికి చెందిన పలువురు పోలీసు అధికారులు సైబర్ నేరగాళ్ల బారినపడ్డారు. వారి వ్యక్తిగత ఫేస్‌బుక్‌ అకౌంట్లు హ్యాక్‌ అయ్యాయి. సీఐలు రామకృష్ణ, సాయిగిరిధర్‌.. ఎస్సైలు తిమ్మయ్య, సుమతి ఫేస్‌బుక్‌ అకౌంట్లు హ్యాక్ చేసిన దుండగులు… డబ్బులు దండుకునే ప్రయత్నం చేశారు. ఫేస్​బుక్​ మెసేంజర్​ ద్వారా… ఆయా ఖాతాల్లో ఉన్న స్నేహితులకు మెసేజీలు పంపించి డబ్బులు కావాలని రిక్వెస్ట్ పంపించారు. కొందరు తెలిసిన వ్యక్తులు సదరు పోలీసు అధికారులకు ఫోన్ చేసి… అంత ఎమర్జెన్సీ ఏంటని… ఎలా పంపించాలని వివరాలు అడగడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

ఇలా పలువురు మిత్రులు, బంధువుల నుంచి ఫోన్లు వచ్చాక… పోలీసు అధికారులు అలెర్ట్ అయ్యారు. విచారణ చేస్తే తమ ఫేస్​బుక్​ ఖాతాలు హ్యాక్​ అయినట్టు గుర్తించారు. తమ పేర్లతో వచ్చే మెసేజ్ లను నమ్మొద్దని… డబ్బులు వేయొద్దని తమ ఖాతాల్లో పోస్టు చేశారు. దీనిపై తిరుపతి సైబ్ర్ క్రైం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Also Read :

కృష్ణా జిల్లాలో యాక్సిడెంట్, తండ్రీకూతుళ్లను బలితీసుకున్న లారీ

వివేకా హత్య కేసు అప్డేట్ : ఆర్థిక లావాదేవీల కోణంలో సీబీఐ ఫోకస్

Follow Us
నువ్వు నువ్వు పాట వెనుక ఇంత అర్థం ఉందా.. ?
నువ్వు నువ్వు పాట వెనుక ఇంత అర్థం ఉందా.. ?
తిరుమలలో దర్శనం టికెట్ల జారీ బంద్.. టీటీడీ అలర్ట్..
తిరుమలలో దర్శనం టికెట్ల జారీ బంద్.. టీటీడీ అలర్ట్..
ఆగస్టు నెలలో 9 రోజులు బ్యాంకులు బంద్‌..!
ఆగస్టు నెలలో 9 రోజులు బ్యాంకులు బంద్‌..!
ఇది చిన్న కథ కాదుగా.. వడ మధ్యలో రంధ్రం వెనకున్న సైన్స్ తెలిస్తే..
ఇది చిన్న కథ కాదుగా.. వడ మధ్యలో రంధ్రం వెనకున్న సైన్స్ తెలిస్తే..
వైభవ్ కి బిగ్ టెస్ట్.. జింబాబ్వే సిరీస్‌లో రుజువు చేసుకుంటాడా?
వైభవ్ కి బిగ్ టెస్ట్.. జింబాబ్వే సిరీస్‌లో రుజువు చేసుకుంటాడా?
తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. ఈరోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. ఈరోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
టీమిండియాకు పొంచి ఉన్న హ్యాట్రిక్ క్లీన్ స్వీప్ ముప్పు..!
టీమిండియాకు పొంచి ఉన్న హ్యాట్రిక్ క్లీన్ స్వీప్ ముప్పు..!
టెక్ ప్రపంచంలో సరికొత్త 'GOAT' వార్.. మరి ఫుట్‌బాల్ లెజెండ్స్‌
టెక్ ప్రపంచంలో సరికొత్త 'GOAT' వార్.. మరి ఫుట్‌బాల్ లెజెండ్స్‌
మీ పేరు ఎస్‌ఐఆర్‌లో నమోదైందా..? లేదా? ఈ నెంబర్‌కు మెస్సేజ్ చేస్తే
మీ పేరు ఎస్‌ఐఆర్‌లో నమోదైందా..? లేదా? ఈ నెంబర్‌కు మెస్సేజ్ చేస్తే
టెన్సర్ G6 ప్రాసెసర్: గూగుల్‌ పిక్సెల్ 11a స్పెసిఫికేషన్స్‌ ఇవే
టెన్సర్ G6 ప్రాసెసర్: గూగుల్‌ పిక్సెల్ 11a స్పెసిఫికేషన్స్‌ ఇవే