రేపే చంద్రగ్రహణం, తిరుమల ఆలయం మూసివేత

రేపు చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయం మూతపడనుంది. మంగళవారం సాయంత్రం 7 గంటలకు మూసివేసి 17వ తేదీ ఉదయం 4.30 గంటలకు తెరవనున్నారు. ఆలయశుద్ధి, పుణ్యవచనం తరువాత స్వామి వారికి సుప్రభాత సేవ చేసిన అనంతరం భక్తులకు దర్శనాన్ని కల్పిస్తారు. అలాగే.. ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయం మూసివేయనున్నట్లు ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు. రేపు సాయంత్రం 4.30 నుంచి 17వ తేదీ ఉదయం 5.30 వరకు భక్తులకు దర్శనాలను నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. 17వ […]

రేపే చంద్రగ్రహణం, తిరుమల ఆలయం మూసివేత

Edited By:

Updated on: Jul 15, 2019 | 2:21 PM

రేపు చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయం మూతపడనుంది. మంగళవారం సాయంత్రం 7 గంటలకు మూసివేసి 17వ తేదీ ఉదయం 4.30 గంటలకు తెరవనున్నారు. ఆలయశుద్ధి, పుణ్యవచనం తరువాత స్వామి వారికి సుప్రభాత సేవ చేసిన అనంతరం భక్తులకు దర్శనాన్ని కల్పిస్తారు. అలాగే.. ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయం మూసివేయనున్నట్లు ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు. రేపు సాయంత్రం 4.30 నుంచి 17వ తేదీ ఉదయం 5.30 వరకు భక్తులకు దర్శనాలను నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. 17వ తేదీ ఉదయం సుప్రభాత సేవ రద్దు చేస్తున్నట్లు ఈవో పేర్కొన్నారు.