ఫ్రాన్స్ లోని నైస్ లో గల కేథడ్రిల్ చర్చిలో గురువారం ఉదయం జరిగిన ఉగ్ర దాడిలో ముగ్గురు మరణించారు. చర్చ్ వార్డెన్ తలను, మరో మహిళ తలను ఉగ్రవాది నరికివేశాడు . అతని దాడిలో మరొక మహిళ మరణించింది. విచక్షణా రహితంగా అతడు కత్తితో అనేకమందిని గాయపరిచాడు. చర్చిలో ప్రార్థనలు మొదలవుతుండగా ఈ దారుణం జరిగింది. అల్లాహో అక్బర్ అని నినాదాలు చేసుకుంటూ పరుగులు తీస్తున్న అతనిపై పోలీసులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో గాయపడిన అతడిని అరెస్టు చేసి ఆసుపత్రికి తరలించారు. నోటెర్ డామ్ బెసిలికాలో ఇది అతి పెద్ద రోమన్ కేథలిక్ చర్చి.. ఉగ్రవాది ఎటాక్ లో చర్చిలోనే ఇద్దరు మృతి చెందారని మేయర్ క్రిస్టియన్ ఎస్ట్రో సీ తెలిపారు. సుమారు 15 రోజుల క్రితమే పారిస్ సమీపంలో ఒక టీచర్ తలను టెర్రరిస్టు నరికివేశాడని పోలీసులు తెలిపారు.