పూణేలో ఘోర రోడ్డుప్రమాదం.. అదుపుతప్పిన ట్రక్.. ముగ్గురు మృతి, ఆరుగురికి తీవ్రగాయాలు
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కంటెయినర్ ట్రక్ బ్రేక్ ఫెయిల్ కావడంతో అదుపు తప్పి ఇతర వాహనాలను ఢీకొనడంతో ముగ్గురు మరణించగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కంటెయినర్ ట్రక్ బ్రేక్ ఫెయిల్ కావడంతో అదుపు తప్పి ఇతర వాహనాలను ఢీకొనడంతో ముగ్గురు మరణించగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదఘటన మహారాష్ట్రలోని పూణే నగరంలో చోటుచేసుకుంది. పూణేలోని నవాలీ బ్రిడ్జి వద్ద కట్రాజ్ రోడ్డుపై ఆదివారం రాత్రి అతివేగంగా వచ్చిన కంటెయినర్ ట్రక్ అదుపు తప్పి పలు వాహనాలను ఢీకొట్టి బీభత్సం సృష్టించింది. ట్రక్ నాలుగు కార్లు, రెండు ద్విచక్రవాహనాలు, ఆటో రిక్షాలపై దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే దుర్మరణం పాలవ్వగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను హుటాహుటీన సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ట్రక్ డ్రైవరును అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.