ఆటో-అయిల్ ట్యాంకర్ ఢీ.. ముగ్గురు యువకులు మృతి
తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. తాళ్ళరేవు బైపాస్ రోడ్డులో ఆటో - అయిల్ ట్యాంకర్ ఢీకొని ఇద్దరు అంధులతో సహా ముగ్గురు యువకులు అక్కడిక్కడే దుర్మరణం పాలయ్యారు.
తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. తాళ్ళరేవు బైపాస్ రోడ్డులో ఆటో – అయిల్ ట్యాంకర్ ఢీకొని ఇద్దరు అంధులతో సహా ముగ్గురు యువకులు అక్కడిక్కడే దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ఇద్దరు అంధులు, ఒకరు ఆటో డ్రైవర్ ఉన్నారని పోలీసులు తెలిపారు. కాకినాడ శారదాదేవి టెంపుల్, భానుగుడికి చెందిన ఇద్దరు ఆటోలో ప్రయాణిస్తున్నారు. వెనుక నుంచి అయిల్ ట్యాంకర్ ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అంధులతో సహా ఆటోడ్రైవర్ ఆరెళ్ళ వెంకటేష్( 17) మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. రోడ్డుప్రమాదంతో భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు వాహనాలను దారి మళ్లిస్తున్నారు. ఘటనా స్థలంలో భారీ వర్షం కురుస్తుండటంతో సహాయక చర్యలకు కాస్త అటంకం కలుగుతోంది.