మిస్సింగ్‌లపై అసత్య ప్రచారం చేస్తున్న వారికి పోలీసులు షాక్!

| Edited By:

Jun 13, 2019 | 8:36 PM

సోషల్ మీడియాలో మిస్సింగ్‌లఫై అసత్య ప్రచారం చేస్తున్న ముగ్గురిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ యువ సైన్యం ఫేస్‌ బుక్ పేజీ అడ్మిన్‌ఫై కేసు నమోదు చేసి వెంకట్, బాలరాజు, క్రాంతి కిరణ్‌లను అరెస్ట్ చేశారు. కాగా మహిళలు, పిల్లలు అపహరణకు గురౌతున్నారంటూ తెలంగాణలో దుష్ప్రచారం జరుగుతోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీజీపీ మహేందర్ రెడ్డి సూచించారు. మిస్సింగ్ కేసులలో చాలావరకు కుటుంబం, ప్రేమ వ్యవహారం, పరీక్షల్లో ఫెయిలవడం, పిల్లలు తల్లిదండ్రులపై అలిగి వెళ్లిపోవడం, […]

మిస్సింగ్‌లపై అసత్య ప్రచారం చేస్తున్న వారికి పోలీసులు షాక్!
Follow us on

సోషల్ మీడియాలో మిస్సింగ్‌లఫై అసత్య ప్రచారం చేస్తున్న ముగ్గురిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ యువ సైన్యం ఫేస్‌ బుక్ పేజీ అడ్మిన్‌ఫై కేసు నమోదు చేసి వెంకట్, బాలరాజు, క్రాంతి కిరణ్‌లను అరెస్ట్ చేశారు. కాగా మహిళలు, పిల్లలు అపహరణకు గురౌతున్నారంటూ తెలంగాణలో దుష్ప్రచారం జరుగుతోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీజీపీ మహేందర్ రెడ్డి సూచించారు. మిస్సింగ్ కేసులలో చాలావరకు కుటుంబం, ప్రేమ వ్యవహారం, పరీక్షల్లో ఫెయిలవడం, పిల్లలు తల్లిదండ్రులపై అలిగి వెళ్లిపోవడం, కుటుంబ సభ్యుల సంరక్షణ దొరకక తల్లిదండ్రులు వెళ్లిపోవడం వంటి కారణాల వల్ల నమోదౌతున్నాయని తెలిపారు. మిస్సింగ్ కేసులలో 85 శాతానికి పైగా ట్రేస్ చేశామని, మిగతావి ట్రేస్ చేయడానికి పోలీసులు అన్ని యత్నాలూ కొనసాగిస్తున్నారని చెప్పారు. సోషల్ మీడియాలో పుకార్లను వ్యాపింప చేసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీజీపీ మహేందర్ రెడ్డి హెచ్చరించారు.