3 నగరాలు.. 2 జిల్లాల్లో మొత్తం బంద్

|

Apr 24, 2020 | 3:26 PM

కరోనా వైరస్ విస్తరిస్తున్న వేగంతో తమిళనాడులోని చాలా ప్రాంతాలు రెడ్ జోన్‌లోకి వెళుతున్నాయి. చెన్నై నగరంతోపాటు మదురై, కోయంబత్తూర్ లాంటి ప్రధాన తమిళ నగరాలు కరోనా చేతికి చిక్కి విలవిలలాడుతున్నాయి. దాంతో ఫళని స్వామి ప్రభుత్వం శుక్రవారం కఠిన నిర్ణయం తీసుకుంది.

3 నగరాలు.. 2 జిల్లాల్లో మొత్తం బంద్
Follow us on

కరోనా కరాళ నృత్యం ప్రభుత్వాలను కఠిన నిర్ణయాల వైపు నెడుతోంది. కేంద్రంలో మోదీ ప్రభుత్వం తొలుత లాక్ డౌన్ ఆదేశాలు జారీ చేసినా.. చాలా అంశాల్లో రాష్ట్రాలకు స్వేచ్ఛనిచ్చింది. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా మినహాయింపులివ్వడమో లేక మరింత కఠినతరం చేయడమో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను నిర్ణయం తీసుకోవచ్చని మోదీ ప్రభుత్వం తెలిపింది. దాంతో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు.

కరోనా వైరస్ విస్తరిస్తున్న వేగంతో తమిళనాడులోని చాలా ప్రాంతాలు రెడ్ జోన్‌లోకి వెళుతున్నాయి. చెన్నై నగరంతోపాటు మదురై, కోయంబత్తూర్ లాంటి ప్రధాన తమిళ నగరాలు కరోనా చేతికి చిక్కి విలవిలలాడుతున్నాయి. దాంతో ఫళని స్వామి ప్రభుత్వం శుక్రవారం కఠిన నిర్ణయం తీసుకుంది. తమిళనాడులోని మూడు నగరాలు, రెండు జిల్లాల్లో ఏప్రిల్ 26 నుంచి 29వ తేదీ నాలుగు రోజులు టోటల్ లాక్ డౌన్ అమలు పరచాలని ఫళని స్వామి ప్రభుత్వం నిర్ణయించింది.

చెన్నై నగరంలో 400 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. కోయంబత్తూర్ నగరంలో 134, తిరుప్పూర్ జిల్లాలో 110 మందికి కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలింది. చెన్నై, మదురై, కోయంబత్తూర్ నగరాలలో ఈ నెల 26వ తేదీ నుండి 29వ తేదీ వరకు (నాలుగు రోజులు) సంపూర్ణ లాక్ డౌన్ అమలు చేయాలని నిర్ణయించారు. తిరుప్పూర్, సేలం జిల్లాలో ఈ నెల 26వ తేదీ నుండి 28వ తేదీ వరకు (మూడు రోజులు) సంపూర్ణ లాక్ డౌన్ అమలు చేయాలని ఫళని స్వామి సర్కార్ నిర్ణయించింది.