‘వీ స్టాండ్ విత్ ఫార్మర్స్’, భారతీయ రైతుల ఆందోళనకు మద్దతు, లండన్ లో వేలాది మంది ర్యాలీ, అరెస్ట్

ఇండియాలో ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా లండన్ లో ఆదివారం వేలాది మంది భారీ ర్యాలీ నిర్వహించారు. కోవిడ్ 19 నిబంధనలను అతిక్రమించారంటూ అనేకమందిని పోలీసులు అరెస్టు చేశారు.

'వీ స్టాండ్ విత్ ఫార్మర్స్', భారతీయ రైతుల ఆందోళనకు మద్దతు, లండన్ లో వేలాది మంది ర్యాలీ, అరెస్ట్
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Dec 07, 2020 | 10:51 AM

ఇండియాలో ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా లండన్ లో ఆదివారం వేలాది మంది భారీ ర్యాలీ నిర్వహించారు. కోవిడ్ 19 నిబంధనలను అతిక్రమించారంటూ అనేకమందిని పోలీసులు అరెస్టు చేశారు. వీ స్టాండ్ విత్ ఫార్మర్స్, జస్టిస్ ఫర్ ఫార్మర్స్, ఇండియా స్టాప్ సెల్లింగ్ ఆఫ్ యువర్ ఫార్మర్స్ అని రకరకాల నినాదాలు రాసి ఉన్న ప్లకార్డులను చేతబట్టుకుని వీరంతా అక్కడి భారత్ ఎంబసీ వద్ద ప్రొటెస్ట్ చేశారు. వీరిలో సిక్కులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. కొందరు ప్రధాని మోదీ పోస్టర్ తో ప్రదర్శనలో పాల్గొన్నారు. అయితే భారత రైతుల ఆందోళన ఆ దేశ అంతర్గత ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగమని, కొంతమంది  వ్యతిరేక వేర్పాటువాదులు భారత  రైతుల ఆందోళనను సాకుగా తీసుకుని ఈ ప్రదర్శనకు దిగారని ఇండియన్ హైకమిషన్ అధికార ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. అసలు అనుమతి లేకుండా ఇంతమంది ఎలా నిరసనకు పూనుకొన్నారని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.భారత ప్రభుత్వం ఇంకా రైతులతో చర్చలు జరుపుతున్న విషయాన్ని మరువరాదని ఆయన చెప్పారు. ఇటీవల బ్రిటిష్ సిక్కు ఎంపీ తన్ మన్ జిత్ సింగ్ ధేశీ ఆధ్వర్యాన 36 మంది ఎంపీలు కూడా భారత రైతుల ప్రొటెస్ట్ పై స్పందించారు. రైతుల ఆందోళనపై ఇండియా విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ తో చర్చించవలసిందిగా కోరుతూ వీరు తమ దేశ విదేశ వ్యవహారాల మంత్రి డొమినిక్ రాబ్ కు లేఖ రాశారు.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!