బైక్ ను చోరీ చేసి.. తిరిగి పంపించిన ‘మంచి దొంగ’..

| Edited By: Pardhasaradhi Peri

Jun 01, 2020 | 2:13 PM

కోవిద్-19 విజృంభిస్తోంది. ఇప్పుడు భారత్ లో విలయతాండవం చేస్తోంది. లాక్ డౌన్ సడలింపులతో ప్రజా జీవనం తిరిగి ప్రారంభమయింది. అయితే.. బైక్‌ను చోరీ చేసిన ఓ దొంగ 15రోజుల తర్వాత దాన్ని తిరిగి పార్శిల్ ద్వారా

బైక్ ను చోరీ చేసి.. తిరిగి పంపించిన మంచి దొంగ..
Follow us on

కోవిద్-19 విజృంభిస్తోంది. ఇప్పుడు భారత్ లో విలయతాండవం చేస్తోంది. లాక్ డౌన్ సడలింపులతో ప్రజా జీవనం తిరిగి ప్రారంభమయింది. అయితే.. బైక్‌ను చోరీ చేసిన ఓ దొంగ 15రోజుల తర్వాత దాన్ని తిరిగి పార్శిల్ ద్వారా యజమానికి పంపించిన ఘటన తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూర్ నగరంలోని పల్లపాలయం ప్రాంతంలో వెలుగుచూసింది. కోయంబత్తూర్ నగరానికి చెందిన సురేష్ తన బైక్ ను వర్క్ షాపు ముందు పార్కింగ్ చేశాడు.

కాగా.. మే 18వతేదీన తన బైక్ ను ఎవరో చోరీ చేశారని సురేష్ సూలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సురేష్ కు ఓ పార్శిల్ ఏజెన్సీ నుంచి పార్శిల్ వచ్చిందంటూ ఓ ఫోన్ కాల్ వచ్చింది. పార్శిల్ లో చోరీ అయిన తన బైక్ రావడం చూసి సురేష్ ఆశ్చర్యపోయాడు. 1400 రూపాయలు పార్శిల్ ఏజెంటుకు చెల్లించి బైక్ తీసుకున్నాడు. ఎవరో వలసకార్మికుడు బైక్ ను చోరీ చేసి తీసుకువెళ్లి గమ్యస్థానం చేరాక, దాన్ని పార్శిల్ ద్వార తిరిగి పంపించాడని సురేష్ చెప్పారు. బైక్ చోరీ చేసి తిరిగి ఇచ్చిన మంచి దొంగను సురేష్ అభినందించడం విశేషం.

Also Read: తెలంగాణలో జులై 1 నుంచి పాఠశాలలు ప్రారంభం.. మార్గదర్శకాలు ఇవే!