ఏపీలోని ఈ ఐదు జిల్లాల్లో అత్యధిక కరోనా కేసులు..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. టెస్టులు పెంచే కొద్దీ అధిక సంఖ్యలో పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి.

ఏపీలోని ఈ ఐదు జిల్లాల్లో అత్యధిక కరోనా కేసులు..
Follow us

|

Updated on: Sep 16, 2020 | 10:01 AM

Highest Number Of Corona Positive Cases AP: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. టెస్టులు పెంచే కొద్దీ అధిక సంఖ్యలో పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. అటు ఏపీ ప్ర‌భుత్వం కూడా క‌రోనా క‌ట్ట‌డికి ఎన్నో ర‌కాల జాగ్ర‌త్త‌లు తీసుకుంటుంది. ఇక ఇప్ప‌టికే ప‌లువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్ర‌జా ప్ర‌తినిధులు కోవిడ్ బారిన ప‌డిన విష‌యం తెలిసిందే. మ‌రోవైపు రాష్ట్రంలో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 5,83,925కి చేరుకుంది. అందులో యాక్టివ్ కేసులు 92,353 ఉండ‌గా, 5041 మంది వైరస్ కారణంగా మ‌ర‌ణించారు. ఇదిలా ఉంటే కరోనా కేసులతో పాటు రికవరీ రేటు కూడా క్రమక్రమంగా పెరుగుతుండటం ప్రజలకు కాస్త ఊరటను ఇచ్చే అంశం. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 4,86,531 మంది కోవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

కాగా ప్ర‌స్తుతం ఏపీలోని క‌ర్నూలు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావ‌రి, అనంతపురం, చిత్తూరు.. ఈ ఐదు జిల్లాల్లో కోవిడ్ పాజిటివ్‌ కేసులు అధికంగా ఉన్నాయి. అంతేకాదు ఈ జిల్లాల్లో మరణాల సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. ఇక ఏపీలో అత్య‌ధిక క‌రోనా కేసుల‌తో తూర్పు గోదావరి జిల్లా టాప్‌లో ఉంది. ఈస్ట్ గోదావ‌రిలో క‌రోనా కేసుల సంఖ్య ఏకంగా 80 వేలకు చేరువైంది. ప్ర‌స్తుతం అక్క‌డ 79,643 క‌రోనా కేసులు ఉండ‌గా, ఇప్ప‌టివ‌ర‌కూ 464 మంది కోవిడ్ బారిన ప‌డి మ‌ర‌ణించారు. నిన్న ఒక్క రోజే అక్కడ 1423 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ప్రస్తుతం ఆ జిల్లాలో 11,999 యాక్టీవ్ కేసులు ఉండ‌గా, 67,180 మంది క‌రోనా నుంచి కోలుకుని ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

ఇక పశ్చిమ గోదావరిలో 52,520 కోవిడ్ కేసులు రిజిస్ట‌ర్ కాగా, ఇప్ప‌టివ‌ర‌కూ అక్క‌డ 396 మంది చ‌నిపోయారు. అలాగే క‌ర్నూలులో 52,280 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, చిత్తూరులో 50,718 పాజిటివ్ కేసులు, అనంతపురంలో 50,088 కేసులు బయటపడ్డాయి. ఇక ఏపీలో అత్యధిక కరోనా మరణాలు చిత్తూరు జిల్లాలో సంభవించాయి. అక్కడ కోవిడ్ కారణంగా 543 మంది మ‌ర‌ణించారు. ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఏమాత్రం క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపించినా నిర్ల‌క్ష్యం వ‌హించ‌కుండా వెళ్లి టెస్టులు చేయించుకోవాల‌ని పేర్కొంటున్నారు. అలాగే వేడి ఆహారం, గోరువెచ్చ‌టి నీరు తాగాల‌ని వైద్యులు సూచిస్తున్నారు.

Also Read:

ఏపీ వాహనదారులకు అలెర్ట్.. లైట్ తీసుకుంటే ఇక అంతే!

అమెరికాను వణికిస్తున్న కొత్త రకం ‘బ్యాక్టీరియా’.!

బిగ్ బాస్ 4: ఈ సీజన్‌లో ఆమెదే భారీ రెమ్యునరేషన్

కేంద్రం మరో సంచలనం.. త్వరలోనే హైదరాబాద్‌కు బుల్లెట్ ట్రైన్.!