Bladder Infection: ఈ చిట్కాలతో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్‌కు చెక్.. ఇంట్లో ఉండే వ్యాధిని నయం చేసుకోవచ్చు..

సాధారణంగా బ్లాడర్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మూత్ర విసర్జన చేసే సమయంలో నొప్పి, మంట ఉంటాయి. అలాగే మూత్రంలో రక్తం కూడా పడుతుంది. దుర్వాసన వస్తుంది. సాధారణం కన్నా ఎక్కువ సార్లు మూత్ర విసర్జనకు వెళ్తారు.

Bladder Infection: ఈ చిట్కాలతో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్‌కు చెక్.. ఇంట్లో ఉండే వ్యాధిని నయం చేసుకోవచ్చు..
Urinary Tract Infections

Updated on: Jul 27, 2023 | 4:30 PM

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్(యూటీఐ) అనేవి యూరినరీ సిస్టమ్ లో ఎక్కడైనా రావచ్చు. అంటే కిడ్నీలు, యూరేటర్స్(మూత్ర నాళాలు), బ్లాడర్(మూత్రాశయం), యురేత్రా(మూత్ర నాళం) వంటి వాటిల్లో వ్యాపిస్తుంది. ఇది కూడా ఓ రకమైన అంటు వ్యాధనే చెప్పాలి. దిగువ మూత్ర నాళంలో ఇవి సోకుతాయి. క్రిములు మొదట మూత్రనాళంలోకి ప్రవేశిస్తాయి. ఆ తర్వాత బ్లాడర్ లోకి చేరి బ్లాడర్ ఇన్పెక్షన్ ను కలుగజేస్తాయి.

సాధారణంగా బ్లాడర్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మూత్ర విసర్జన చేసే సమయంలో నొప్పి, మంట ఉంటాయి. అలాగే మూత్రంలో రక్తం కూడా పడుతుంది. దుర్వాసన వస్తుంది. సాధారణం కన్నా ఎక్కువ సార్లు మూత్ర విసర్జనకు వెళ్తారు. మీ పొత్తి కడుపు, లేదా దిగువ వీపులో తిమ్మిరి లేదా ఒత్తిడి ఉంటుంది. వాస్తవానికి దీనికి కొన్ని యాంటీ బయోటిక్స్ ఇవ్వడం ద్వారా వైద్యులు దీనిని నయం చేస్తారు. అయితే ఈ యాంటీ బయాటిక్స్ వల్ల పేగుల్లో మంచి బ్యాక్టిరియా కూడా నశిస్తుంది. అందువల్ల కొన్ని ఇంట్లోనే ఉండి పాటించే నియమాలతోనే దీనిని నయం చేసుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

వెల్లుల్లి.. యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉన్న వెల్లుల్లి రెబ్బలు బ్లాడర్ ఇన్ఫెక్షన్స్ ను తగ్గించడంలో సాయపడతాయి. వెల్లుల్లి నుంచి 4 నుంచి 5 రెబ్బలు వేరు చేసి ఒక వారం పాటు తినాలి. వెల్లుల్లి ఊరగాయలా కూడా చేసి తినవచ్చు.

ఇవి కూడా చదవండి

నీరు ఎక్కువగా తీసుకోవాలి.. మీరు యూటీఐతో బాధపడుతున్నట్లు అయితే ఎక్కువగా ద్రవాలు తాగాలని నిపుణులు సూచిస్తారు. ఎందుకంటే ఇది మీ మూత్రాశయం నుంచి చెడు బ్యాక్టీరియాను బయటకు పంపడంలో సాయపడతాయి. ఉదయం పూట కనీసం ఒక లీటర్, ఒక రోజులో 6 నుంచి 8 గ్లాసుల నీరు తాగాలి.

ఆల్కాహాల్ మానేయాలి.. ఆల్కాహాల్ మూత్ర విసర్జనను ప్రోత్సహిస్తుంది. దీంతో మీ శరీరం డీ హైడ్రేట్ అవుతుంది. మూత్రశయ వ్యవస్థలో తక్కువ ద్రవం ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్ తీవ్రత ఎక్కువ అవుతుంది. అలాగే తగ్గినట్లే తగ్గి, మళ్లీ వచ్చే అవకాశం ఉంటుంది.

క్రాన్బెర్రీ జ్యూస్.. ఈ జ్యూస్ తాగడం వల్ల బ్లాడర్ లో బ్యాక్టీరియా తగ్గుతుంది. ఇన్ఫెక్షన్ అదుపులోకి వస్తుంది.

వంట సోడా.. అర టీ స్పూన్ బేకింగ్ సోడాను తీసుకొని ఒక గ్లాసు నీటిలో కలిపి తాగొచ్చు. అల్పాహారానికి ముందు దీనిని తాగితే మూత్రాశయంలో మంట తగ్గిపోతుంది.

ఆహారం.. బ్లాడర్ ఇన్పెక్షన్ తో బాధపడుతున్నట్లు అయితే మీరు తినే ఆహారంపై దృష్టి పెట్టాలి. మీ వ్యాధిని మరింత తీవ్రతరం చేసే ఆహారాన్ని తీసుకోవద్దు. కొన్ని రోజులు పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. అధిక ప్రోటీన్లు ఉండే ఆహారానికి కొద్ది రోజు దూరంగా ఉండాలి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..