నెట్ లేనిదే జీవితం లేదనే విధంగా ఉంది ఇప్పటి యువత పరిస్థితి. అందుకు అనుగుణంగానే ఆహ్లదానికి, ఆనందానికి ఎన్నో సరికొత్త యాప్స్ పుట్టుకొస్తున్నాయి. అయితే ఆ యాప్స్‌తో సైబర్ క్రైమ్స్ కూడా ఎక్కువైపోయాయి. టెక్నాలజీ సాయంతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతూ.. యూజర్ల దగ్గర నుంచి నగదు, కీలక సమాచారాన్ని లాగేందుకు కొత్త పంధాలను ఫాలో అవుతున్నారు. ఎట్రాక్టివ్ థీమ్స్, సరికొత్త పేర్లతో కొత్తరకమైన యాప్స్ రూపొందించి.. వాటిని జనాలు ఫోన్లో ఇన్‌స్టాల్ చేసుకునే విధంగా ఆకర్షిస్తున్నారు. ఇక ఆ యాప్స్ ద్వారా మాల్‌వేర్ వైరస్‌లు స్మార్ట్ ఫోన్‌లలోకి వచ్చేస్తున్నాయి. దీంతో మన విలువైన సమాచారం దొంగల చేతికి అందుతోంది. ఇక ఈ సమాచారంతో జల్లెడపట్టిన గూగుల్ సంస్థ.. కొన్ని డేంజరస్ యాప్స్‌ను గుర్తించింది. అవన్నీ రూల్స్‌కు విరుద్ధంగా ఉండటంతో.. యూజర్లు వీటి విషయంలో అలెర్ట్‌గా ఉండాలని గూగుల్ హెచ్చరించింది. ఇలాంటివి ఫోన్‌లో ఉంటే వెంటనే డిలీట్ చేయాలంటూ సూచించింది. ఇప్పటికే ప్లే స్టోర్ నుంచి సుమారు 29 యాప్స్‌ను తొలిగించింది కూడా.
ఈ యాప్స్ అన్ని HiddAd కేటగిరీకి చెందినవని సైబర్ సెక్యూరిటీ సంస్థ క్విక్ హీల్ స్పష్టం చేసింది. వీటిని ఇన్‌స్టాల్ చేసినప్పుడు.. ఫోన్లో ఐకాన్ మాయం అయ్యి.. ఆ యాప్‌కి సంబంధించిన షార్ట్‌కట్ హోమ్ స్క్రీన్‌పై కనిపిస్తుందట. తద్వారా ఆ యాప్ అన్ ఇన్‌స్టాల్ చేయడం కుదరదు. అటు ఆ షార్ట్ కట్ ఐకాన్‌ను క్లిక్ చేస్తే.. ఫుల్ స్క్రీన్ యాడ్స్ రావడమే కాకుండా సోషల్ మీడియా యాప్స్ ఉపయోగిస్తున్నప్పుడు మధ్యలో వచ్చే అడ్వర్టైజ్ మెంట్ యాడ్ వేర్ యాప్స్ ను కూడా.. వెంటనే ఇన్ స్టాల్ చేసేస్తాయట. కాబట్టి అందరూ కూడా ఆ యాప్స్‌ను వెంటనే ఫోన్ల నుంచి డిలేట్ చేస్తే విలువైన సమాచారం భద్రంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. కాగా ఆ 29 యాప్స్ లిస్ట్‌ను మీరు కూడా ఓ లుక్కేయండి.