సెక్యూరిటీ గార్డు లేని దుకాణాలే వారి టార్గెట్.. పగలంతా తిరుగుతారు.. రాత్రి పని కానిచ్చేస్తారు..
సెక్యూరిటీ గార్డు లేని దుకాణాలే వారి టార్గెట్.. పగలంతా తిరుగుతారు, రెక్కీ నిర్వహిస్తారు. రాత్రి చోరీలకు పాల్పడుతారు ఇది వారి స్టైల్..

సెక్యూరిటీ గార్డు లేని దుకాణాలే వారి టార్గెట్.. పగలంతా తిరుగుతారు, రెక్కీ నిర్వహిస్తారు. రాత్రి చోరీలకు పాల్పడుతారు ఇది వారి స్టైల్.. తాజాగా హైదరాబాద్‌లోని మియాపూర్ రిలయన్స్ డిజిటల్ షోరూంలో చోరీకి పాల్పడింది ఈ ముఠానే.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగర శివారులోని మియాపూర్ పరిధి మదీనాగూడలోని రిలయన్స్ డిజిటల్ షోరూంలో ఇటీవల రూ.40లక్షల విలువైన సెల్‌ఫోన్లు చోరికి గురయ్యాయి. దీంతో షాప్ నిర్వహాకులు పోలీసులకు సమాచారం అందించడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించాం.
ముంబైకి చెందిన ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి దగ్గరి నుంచి దొంగిలించిన సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అయితే మహమ్మద్ తబ్రేక్ దావూద్ అనే వ్యక్తి ఓ కేసులో జైలుకు వెళ్లగా.. అక్కడ ఒక నలుగురు నేరగాళ్లను పరిచయం చేసుకొని ఒక ముఠాను ఏర్పరిచాడు. వారందరు కలిసి బయటికి వచ్చిన తర్వాత చోరీలకు పాల్పడుతున్నారు. నిర్మానుష్య ప్రాంతాల్లో సెక్యూరిటీ గార్డులేని షాప్‌లను టార్గెట్‌గా చేసుకొని చోరీలకు పాల్పడుతారు. అనంతరం వాటిని ఓఎల్ఎక్స్‌లో అమ్మేస్తారని తెలిపారు. వీరు హైదరాబాద్‌లోనే కాకుండా వివిధ రాష్ట్రాల్లో చోరీలకు పాల్పడినట్లు తెలిసిందన్నారు. ముంబై పోలీసుల సహకారంతో వీరిని పట్టుకున్నామని పోలీసులు వివరించారు.



