తమిళ సినీ పరిశ్రమలో ఓటిటి ప్రకంపనలు..హీరో సూర్య‌కు డైరెక్ట్ వార్నింగ్..

| Edited By: Pardhasaradhi Peri

Apr 25, 2020 | 4:21 PM

లాక్ డౌన్ కారణంగా థియేటర్స్ పూర్తిగా మూసివెయ్య‌డంతో డిస్ట్రిబ్యూట‌ర్స్, బ‌య్య‌ర్స్, థియేట‌ర్స్ నిర్వాహ‌కులు తీవ్ర గ‌డ్డుకాలాన్ని ఎద‌ర్కొంటున్నారు. ఇదే తమ‌కు ప్రాణ‌గండంగా మారిన నేప‌థ్యంలో డిజిటల్ ఓటిటి ద్వారా సినిమాలు విడుదల చేయాలని హీరో సూర్య నిర్ణయం తీసుకోవ‌డంతో త‌మిళ సినిమా ఇండిస్ట్రీలో ప్ర‌కంప‌న‌లు చెల‌రేగాయి. జ్యోతిక నటించిన పోంమగళ్ వందాల సినిమాని డిజిటల్ ఓటిటి ద్వారా విడుద‌ల‌కు సూర్య ప్ర‌స్తుతం స‌న్నాహాలు చేస్తున్నారు. నటుడు సూర్య నిర్ణయాన్ని తమిళనాడు థియేటర్స్ అస్సోసియేషన్ తీవ్రంగా ఖండించింది. ఇటువంటి […]

తమిళ సినీ పరిశ్రమలో ఓటిటి  ప్రకంపనలు..హీరో సూర్య‌కు డైరెక్ట్ వార్నింగ్..
Follow us on

లాక్ డౌన్ కారణంగా థియేటర్స్ పూర్తిగా మూసివెయ్య‌డంతో డిస్ట్రిబ్యూట‌ర్స్, బ‌య్య‌ర్స్, థియేట‌ర్స్ నిర్వాహ‌కులు తీవ్ర గ‌డ్డుకాలాన్ని ఎద‌ర్కొంటున్నారు. ఇదే తమ‌కు ప్రాణ‌గండంగా మారిన నేప‌థ్యంలో డిజిటల్ ఓటిటి ద్వారా సినిమాలు విడుదల చేయాలని హీరో సూర్య నిర్ణయం తీసుకోవ‌డంతో త‌మిళ సినిమా ఇండిస్ట్రీలో ప్ర‌కంప‌న‌లు చెల‌రేగాయి. జ్యోతిక నటించిన పోంమగళ్ వందాల సినిమాని డిజిటల్ ఓటిటి ద్వారా విడుద‌ల‌కు సూర్య ప్ర‌స్తుతం స‌న్నాహాలు చేస్తున్నారు.

నటుడు సూర్య నిర్ణయాన్ని తమిళనాడు థియేటర్స్ అస్సోసియేషన్ తీవ్రంగా ఖండించింది. ఇటువంటి చర్యల వల్ల థియేటర్స్ పూర్తిగా మూసివేసే పరిస్థితి వస్తుందని, త‌మ‌ను రోడ్డు మీద పడేసే చర్యలు మానుకోవాలని థియేట‌ర్ ఓన‌ర్స్ సూచిస్తున్నారు. ఒక‌వేళ త‌మను ప‌ట్టించుకోకుండా డిజిటల్ ఓటిటి ద్వారా సినిమాలు విడుదల చేస్తే… సూర్య నిర్మాణ సంస్థ 2డి ఎంటర్టైన్మెంట్స్ నుంచి వచ్చే చిత్రాల‌తో పాటు… సూర్య, జ్యోతిక న‌టించిన‌ సినిమాలు మేము నిషేధిస్తామని హెచ్చరిస్తారు.