మెట్ల పై నుంచి పడి యువకుడి మృతి

హైదరాబాద్ మహానగరంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు మెట్ల పై నుంచి కింద పడి ఓ యువకుడు మృతి చెందాడు.

మెట్ల పై నుంచి పడి యువకుడి మృతి

Updated on: Oct 22, 2020 | 7:24 AM

హైదరాబాద్ మహానగరంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు మెట్ల పై నుంచి కింద పడి ఓ యువకుడు మృతి చెందాడు. జూబ్లీహిల్స్‌రోడ్డు నంబరు 78లో నివసించే ముత్యాల నరేష్‌(29) స్నేహితుడు తేజతో కలిసి కారులో మంగళవారం రాత్రి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఏటీఎంకు వెళ్లాడు. తేజ కారులో ఉండగా నరేష్‌ డబ్బు డ్రా చేసేందుకు ఏటీఎంలోకి వెళ్లాడు. ఎంతసేపటికీ స్నేహితుడు రాకపోవడంతో తేజ కారులో నుంచి బయటకు వచ్చి చూడగా రక్తపు మరకలు కనిపించాయి. తలకు బలమైన గాయంతో మెట్ల పక్కనే నరేష్‌ పడి ఉన్నాడు. దీంతో అతడిని వెంటనే జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. వైద్యులు అతడిని పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నరేష్‌‌కు ఏడాది క్రితమే వివాహమైనట్టు పోలీసులు తెలిపారు. మెట్లపై నుంచి జారి పడినంత మాత్రమానా మృత్యు కబళించడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

Loading...
Unable to load recommendations.
Follow Us