చెంచా జీలకర్ర చేసే మాయ పెద్దదే.. అప్పుల బాధలను తరిమికొడుతుందంట!
Samatha
1 July 2026
జీలకర్ర గురించి చెప్పాల్సిన పనే లేదు. ప్రతి ఒకరి వంట ఇంటిలో ఈ జీలకర్ర అనేది తప్పనిసరిగా ఉంటుంది.
జీలకర్ర
అయితే చాలా మంది దీనిని వంటల్లో ఉపయోగించడం, ఆరోగ్యం కోసమే అనుకుంటారు. కానీ వాస్తు పరంగా కూడా ఇది ప్రయోజనాలు అందిస్తుందంట.
వంటలు కాదు వాస్తు కూడా
ఒక చెంచా జీలకర్ర అప్పుల బాధలను తరిమి కొట్టి ఇంటిలో ఆనందం, శ్రేయస్సు నింపుతుంది అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. దాని గురించి తెలుసుకుందాం.
అప్పుల బాధలు
మీరు అప్పుల బాధలు ఎదుర్కుంటున్నట్లు అయితే, శుక్ర వారం రోజు జీలకర్రను ఎర్రటి వస్త్రంలో కట్టి ప్రధాన ద్వారానికి వేలాడదీయాలంట. దాని వలన డబ్బు సమస్యలు తగ్గిపోతాయి.
ఆర్థిక సమస్యలు
అంతే కాకుండా కొన్ని సార్లు ఇతరుల చెడు దృష్టి మనుషులపై, వారి ఇంటిపై ఉంటుంది. దీంతో వారు ఏ పని చేసినా కలిసి రాకపోవడం వంటి సమస్యలు ఎదురు అవుతాయి. అలాంటి సమయంలో కూడా జీలకర్ర పని చేస్తుందంట.
చెడు దృష్టి
చెంచా జీలకర్ర తీసుకొని, వాటిని మీ తలపై నుంచి ఏడు సార్లు తింపి, తర్వాత వాటిని పారే నీటిలో వేయడం చాలా మంచిదంట. దీని వలన ఇది మీ పై ఉన్న ప్రతి కూల శక్తిని తరిమేస్తుంది. పనులు పూర్తి అవుతాయంట.
తిప్పడం
అంతే కాకుండా అప్పుల బాధలతో సతమతం అయ్యే వారు కూడా ఈ గింజలను తీసుకొని, ఏకాంత ప్రదేశానికి వెళ్లి మట్టిలో పాతిపెడుతూ, అప్పులు తీరిపోవాలని కోరుకోవాలంట. దీని వలన ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి.
మట్టిలో పాతిపెట్టడం
నోట్ : పై సమాచారం, నిపుణులు, పండితుల ఆధారంగా ఇవ్వడం జరిగింది, టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదని, పాఠకుల ఆసక్తిమేరకే ఇవ్వడం జరిగిందని గుర్తించాలి.