యువకుడి బలి తీసుకున్న ప్రేమ వ్యవహారం

| Edited By: Pardhasaradhi Peri

Oct 21, 2020 | 4:56 PM

ప్రేమ వ్యవహారంలో ఓ యువకుడి నిండు ప్రాణం బలైంది. ఈ దారుణ ఘటన కరీంనగర్‌ జిల్లా వీణవంక మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.

యువకుడి బలి తీసుకున్న ప్రేమ వ్యవహారం
Follow us on

ప్రేమ వ్యవహారంలో ఓ యువకుడి నిండు ప్రాణం బలైంది. ఈ దారుణ ఘటన కరీంనగర్‌ జిల్లా వీణవంక మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పోతిరెడ్డిపల్లికి చెందిన పద్మ, మొగిళి దంపతుల రెండో కుమారుడు ప్రణయ్‌(23) ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ఓ యువతితో ఎనిమిదేళ్లుగా ప్రేమలో ఉన్నాడు. పెళ్లికి యువతి కుటుంబ సభ్యులు నిరాకరించడంతో.. వారిని ఒప్పించే ప్రయత్నం చేస్తూ వచ్చాడు ప్రణయ్. ఇదే విషయమై కొద్ది రోజులుగా రెండు కుటుంబాల మధ్య పంచాయితీలు జరుగుతున్నాయి. సోమవారం రాత్రి యువతితో ఆమె ఇంటి వద్ద ప్రణయ్‌ మాట్లాడుతుండగా యువతి సోదరుడు అనిల్‌ అతనిపై కర్రతో దాడిచేశాడు. అనంతరం సమీపంలోని పొదల్లో యువకుడి మృతదేహాన్ని పడేశారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ముందుగా అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టడంతో యువతి ఇంటి సమీపంలో పరిశీలించగా రక్తపు మరకలు కనిపించాయి. కరీంనగర్‌ సీపీ కమలాసన్‌రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ప్రణయ్‌ తండ్రి మొగిళి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వీణవంక పోలీసులు తెలిపారు.