తాడిపత్రిలో అదే సీన్ : కేతిరెడ్డి పెద్దారెడ్డి – జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటి దగ్గర ఇంకా టెన్షన్.. టెన్షన్.!
అనంతపురం జిల్లా తాడిపత్రి కేంద్రంగా టెన్షన్ కొనసాగుతోంది. ఇవాళ రెండో రోజూ పరిస్థితి ఉద్రికత్తంగానే కనిపిస్తోంది. జేసీ ప్రభాకర్‌రెడ్డి...
అనంతపురం జిల్లా తాడిపత్రి కేంద్రంగా టెన్షన్ కొనసాగుతోంది. ఇవాళ రెండో రోజూ పరిస్థితి ఉద్రికత్తంగానే కనిపిస్తోంది. జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటి పరిసరాలు కర్ఫ్యూ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. డ్రోన్ కెమెరాలతో ఆ ప్రాంతంపై నిఘా పెట్టారు పోలీసులు. జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటివద్ద అదనంగా సీసీటీవీ కెమెరాలను అమర్చుతున్నారు. ప్రస్తుతం జేసీ ఇంట్లోనే ఉన్నారు. ఇక అధికార పార్టీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వద్ద కూడా సేమ్ సీన్స్. అక్కడ గట్టి భద్రత ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆయన ఇంట్లోనే ఉన్నారు. పెద్దారెడ్డి ఇంటికి సమీపంలోనే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇల్లు ఉంది. ఆ ప్రాంతంలో పోలీసులు పహారా కాస్తున్నారు.