తెలుగు రాష్ట్రాల సీఎస్‌ల సమావేశం వాయిదా

గవర్నర్ సమక్షంలో ఇవాళ జరగాల్సిన తెలుగు రాష్ట్రాల సీఎస్‌ల సమావేశం వాయిదా పడింది. బుధవారం ఉదయం 11:30 గంటలకు ఈ భేటీ జరగాలని ముందుగా అధికారులు నిర్ణయించారు. అయితే కొన్ని కారణాల వలన సమావేశాన్ని వాయిదా వేయాలని ఏపీ ప్రభుత్వం కోరింది.దీంతో ఇవాళ్టి సమావేశాన్ని వాయిదా వేసిన అధికారులు.. తదుపరి సమావేశం తేదీ త్వరలోనే ఖరారు చేయనున్నట్లు తెలిపారు. ఇక సీఎస్‌ల భేటీ రద్దైన నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ దగ్గర తెలంగాణా అధికారులు […]

తెలుగు రాష్ట్రాల సీఎస్‌ల సమావేశం వాయిదా

Edited By: Nikhil

Updated on: Jul 03, 2019 | 4:44 PM

గవర్నర్ సమక్షంలో ఇవాళ జరగాల్సిన తెలుగు రాష్ట్రాల సీఎస్‌ల సమావేశం వాయిదా పడింది. బుధవారం ఉదయం 11:30 గంటలకు ఈ భేటీ జరగాలని ముందుగా అధికారులు నిర్ణయించారు. అయితే కొన్ని కారణాల వలన సమావేశాన్ని వాయిదా వేయాలని ఏపీ ప్రభుత్వం కోరింది.దీంతో ఇవాళ్టి సమావేశాన్ని వాయిదా వేసిన అధికారులు.. తదుపరి సమావేశం తేదీ త్వరలోనే ఖరారు చేయనున్నట్లు తెలిపారు. ఇక సీఎస్‌ల భేటీ రద్దైన నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ దగ్గర తెలంగాణా అధికారులు సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా 9, 10 వ షెడ్యూల్ సంస్థల విభజనపై వారు చర్చించనున్నారు.