యాంకర్ భామల ఫోటో షూట్లు : శీతాకాలంలో సోషల్ మీడియాలో హీట్ పెంచుతున్నారు…

|

Dec 06, 2020 | 11:36 AM

స్మాల్‌ స్క్రీన్‌ అంటే చాలు.. చాలామందికి ఏడుపుగొట్టు సీరియల్స్ గుర్తుకువస్తాయి. గుర్తించరు కానీ బుల్లితెర మీద కూడా కావాల్సినంత గ్లామర్ ఉంది...

యాంకర్ భామల ఫోటో షూట్లు : శీతాకాలంలో సోషల్ మీడియాలో హీట్ పెంచుతున్నారు...
Follow us on

స్మాల్‌ స్క్రీన్‌ అంటే చాలు.. చాలామందికి ఏడుపుగొట్టు సీరియల్స్ గుర్తుకువస్తాయి. గుర్తించరు కానీ బుల్లితెర మీద కూడా కావాల్సినంత గ్లామర్ ఉంది. కాకపోతే స్పేస్‌ లేక స్మాల్‌ స్క్రీన్ మీద చూపించకపోయినా.. సోషల్‌ మీడియాలో మాత్రం గ్లామర్ గేట్లు తెరుస్తున్నారు యాంకరమ్మలు. వరుస ఫోటో షూట్స్‌తో మొబైల్స్ స్క్రీన్స్ మీద వేడి పెంచేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ రేంజ్‌ గ్లామర్‌ షో చేస్తున్నారు అనసూయ.. ఆమే అలా ఉంటే మేమెందుకు తగ్గాలి అన్న రేంజ్‌లో రష్మీ, శ్రీముఖిలు కూడా గ్లామర్ డోస్ పెంచారు‌.  అనసూయకు ఏ మాత్రం తగ్గని రేంజ్‌లో గ్లామర్‌ షో చేస్తున్నారు.. స్మాల్‌ స్క్రీన్ మీద తమ గ్లామర్‌కు కావాల్సినంత స్పేస్‌ లేకపోవటంతో సోషల్ మీడియాలో షో షురూ చేశారు. వీళ్లే కాదు.. అంత రేంజ్‌ లేని యాంకర్స్ కూడా గ్లామర్‌ షో విషయంలో హద్దులు దాటేస్తున్నారు.. విష్ణు ప్రియా, వర్షిణీ సౌందరాజన్‌, మంజుషా లాంటి యాంకర్స్‌ అయితే గ్లామర్ షో విషయంలో మరో అడుగు ముందుకేస్తున్నారు.. హాట్‌ ఫోటో షూట్‌లతో ఆడియన్స్ దృష్టిలోనే ఉండేలా జాగ్రత్తగా పడుతున్నారు. మరి ఈ భామలకు హాట్‌ షోలు ఆఫర్లు తెచ్చిపెడతాయో, లేదో చూడాలి.