పలు జిల్లాల్లో ఈ రోజు భారీ వర్షాలు
తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈ రోజు(గురువారం) భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాబోయే మూడు రోజుల పాటు ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. అంతేకాదు, తూర్పు మధ్య బంగాళాఖాతంలో రేపు మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని.. ఇది తదుపరి 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. కాగా, నిన్న ఉదయం గం. 8:30 నుండి […]
తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈ రోజు(గురువారం) భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాబోయే మూడు రోజుల పాటు ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. అంతేకాదు, తూర్పు మధ్య బంగాళాఖాతంలో రేపు మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని.. ఇది తదుపరి 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. కాగా, నిన్న ఉదయం గం. 8:30 నుండి ఈరోజు ఉదయం 8:30 గంటల వరకు అత్యధికంగా మంచిర్యాల జిల్లాలో 12.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారిణి డాక్టర్ శ్రావణి వెల్లడించారు.