
తెలంగాణ పదోతరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు. ఈ సారి ఓవరాల్‌గా 92.43 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈ సారి కూడా 93.68 శాతంతో అమ్మాయిలే పైచేయి సాధించారు. అబ్బాయిలు 91.18 శాతం ఉత్తీర్ణత సాధించారు.
కాగా.. టెన్త్ ఫలితాల్లో జగిత్యాల 99.73 శాతంతో మొదటి స్థానంలో నిలవగా, చివరి స్థానంలో హైదరాబాద్ నిలిచింది. రాష్ట్రంలో దాదాపు 5 లక్షలకు పైగా విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఈ ఫలితాలు www.bse.telangana.gov.in, http;//results.cgg.gov.in వెబ్ సైట్లలో అందుబాటులో ఉంటాయని తెలిపారు అధికారులు.
కాగా.. ఫలితాలపై ఫిర్యాదుల కోసం పాఠశాల ప్రధానోపాధ్యాయులకు ప్రత్యేక యాప్ TS SSC BOARD అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. విద్యార్థులు, టీచర్లు ఆండ్రాయిడ్ ఫోన్లలోని ప్లేస్టోర్ నుంచి ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.