కొనసాగుతున్న తెలంగాణ బంద్.. నిలిచిపోయిన క్యాబ్ సర్వీసులు

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 15వ రోజుకి చేరుకుంది. తమ డిమాండ్లను నెరవేర్చేవరకు సమ్మె కొనసాగిస్తామని ఆర్టీసీ కార్మికులు తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో నేడు తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో ఆర్టీసీ బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. రాజకీయ నాయకులతో పాటు ఉద్యోగ సంఘాలు, క్యాబ్ డ్రైవర్లు కూడా బంద్‌కు మద్దతుగా నిలిచాయి. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్నారు. బంద్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు […]

కొనసాగుతున్న తెలంగాణ బంద్.. నిలిచిపోయిన క్యాబ్ సర్వీసులు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 20, 2019 | 8:00 AM

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 15వ రోజుకి చేరుకుంది. తమ డిమాండ్లను నెరవేర్చేవరకు సమ్మె కొనసాగిస్తామని ఆర్టీసీ కార్మికులు తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో నేడు తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో ఆర్టీసీ బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. రాజకీయ నాయకులతో పాటు ఉద్యోగ సంఘాలు, క్యాబ్ డ్రైవర్లు కూడా బంద్‌కు మద్దతుగా నిలిచాయి. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్నారు. బంద్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా బస్సులను నడిపించాలని ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అయినప్పటికీ ముందుగానే బంద్ ప్రకటించడంతో ఒక్క బస్సు కూడా కదలడం లేదు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌తో పాటు ఆయా డిపోల ఎదుట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడంతో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇక కోర్టు ఆదేశం మేరకు ప్రభుత్వం వెంటనే కార్మిక సంఘాలతో చర్చలకు రావాలని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి, కో కన్వినర్ రాజిరెడ్డి డిమాండ్ చేశారు. తాము చర్చలకు సిద్ధంగా ఉన్నా ప్రభుత్వమే స్పందించడం లేదని, కోర్టు ఆదేశంతోనైనా ప్రభుత్వం చర్చలకు రావాలని చెప్పారు. అయితే తాము ప్రభుత్వం ముందుంచిన 25 డిమాండ్లను నెరవేర్చేందుకు చర్చ జరగాల్సిందేనని తేల్చిచెప్పారు.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..