telangana reports 2817 new coronavirus cases: తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకీ పెరుగుతూ వస్తున్నాయి. నిత్యం పాజిటివ్ కేసులు సంఖ్య ఎక్కువవుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 2,817 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 10 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కేసులు 1,33,406 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇప్పటి వరకు మరణాల సంఖ్య 856కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 32,537 కేసులు యాక్టివ్‌లో ఉన్నాయి. ఇప్పటి వరకు 92,050 మంది డిశ్చార్జ్ అయ్యారు.
రాష్ట్రంలో మరణాల రేటు 0.64 శాతం ఉండగా, దేశంలో 1.76 శాతం ఉన్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. 25,293 మంది హోమ్ ఐసోలేషన్‌లో ఉండగా చికిత్స పొందుతున్నట్లు తెలిపింది. జీహెచ్‌ఎంసీలో అధికంగా 452 కేసులు నమోదు అయ్యాయి. మేడ్చల్ మల్కాజిగిరిలో 129 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. రంగారెడ్డి 216, కరీంనగర్ జిల్లా 164, ఖమ్మం జిల్లాలో 157,నల్గొండ జిల్లాలో 157, నిజామాబాద్ 97, వరంగల్ అర్బన్ 114 , సూర్యాపేట 116, సిద్దిపేట 120, అదిలాబాద్ జిల్లాలో 89 కేసులు రికార్డ్ అయ్యాయి.