తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతూ వస్తుంది. గత కొద్ది రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. నిత్యం 2 వేలకు తగ్గకుండా కొత్త కేసులు నమోదవుతున్నాయి. కాగా, నిన్నటి కంటే కాస్త తక్కువ కేసులు రికార్డు అయ్యాయి, తాజాగార, గడిచిన 24 గంటలలో 2,009 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాగా కరోనా కారణంగా మరో 10 మంది ప్రాణాలను కోల్పోయారు. ఇక కరోనా నుంచి కోలుకుని ఇవాళ కొత్తగా 2,437 మంది డిశ్చార్జ్ అయ్యారు.
అయితే తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,95,609 కి చేరింది. ఇదిలావుండగా, కరోనా నుంచి కోలుకుని ఇప్పటివరకు 1,65,844 మంది డిశ్చార్జ్ అయ్యి ఇళ్లకు చేరుకున్నారు. ప్రస్తుతం 28,620 యాక్టివ్ కేసులతో వివిధ ఆస్పత్రులతో పాటు హోం ఐసోలేషన్ లో ఉంటూ చికిత్సపొందుతున్నారు. అటు రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 1,145 కి చేరింది. కాగా, గడిచిన 24 గంటల్లో 54,098 మంది శాంపిల్స్‌ను పరీక్షించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 31,04,542 టెస్ట్‌లు చేశారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో రికవరీ రేటు 84.78 శాతం ఉండగా, మరణాల రేటు 0.58% ఉన్నట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.